MRO Vanajakshi Did Not Commit any Wrong

Vanajakshi attack report submitted

MRO Vanajakshi, Lady MRO Attack, Vanajakshi Attack Case, Enquiry Committee Report Vanajakshi Case, Vanajakshi Innocent, Vanajakshi Favour, Enquiry Committee Chintamaneni, MRO Vanajakshi CS Dinesh Kumar,

MRO Vanajakshi Attack Report submitted to CS Dinesh Kumar. She not committed any wrong. MLA Chintamaneni and Aides attack her.

వనజాక్షి వివాదం.. తప్పంతా చింతమనేనిదేనా?

Posted: 06/30/2017 08:36 AM IST
Vanajakshi attack report submitted

ఎమ్మార్వో వనజాక్షి, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడి వివాదం పై విచారణ ఓ కొలిక్కి వచ్చేసింది. తీవ్ర ఆరోపణలు రావటంతో ప్రభుత్వం ఓ ద్విసభ్య కమిటీని విచారణ కోసం నియమించిన విషయం తెలిసిందే. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జగదీష్ చంద్ర శర్మ, ఐఏఎస్ అధికారి సాల్మన్ ఆరోఖ్యరాజ్ లతో కూడిన కమిటీ ఎట్టకేలకు తమ నివేదికను ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ కు గురువారం అందజేసింది.

ఈ నివేదికలో వనజాక్షి గీత దాటలేదని ద్విసభ్య కమిటీ అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ముసునూరు మండలంలోని తమ్మిలేరులో ప్రభుత్వ విప్‌ చింతమనేని ప్రభాకర్‌ అనుచరులు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని ఫిర్యాదు రావడంతోనే ఆమె మండల ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ హోదాలో వెళ్లారని, అక్కడ అక్రమరవాణా కంటబడడంతో ఆమె అడ్డుకున్నారని, దీనిని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే అనుచరులు ఆమెపై దాడి చేశారని పేర్కొన్నట్టు తెలుస్తోంది.

వనజాక్షి అక్రమ తవ్వకాలు అడ్డుకున్న తమ్మిలేరు ప్రాంతం ముసునూరు తహసీల్దారు పరిధిలోకే వస్తుందని స్పష్టం చేశారు. చింతమనేని వాదన తప్పని వారు తేల్చి చెప్పారు. అలాగే వనజాక్షి పోలీసులు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఉండకూడదని ద్విసభ్య కమిటీ అభిప్రాయపడింది. గతంలో కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దారు డి.వనజాక్షి హద్దుమీరారంటూ ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఆరోపించి, దాడి చేసిన సంగతి విదితమే. గతంలో ఏపీ కేబినెట్ వనజాక్షిదే తప్పని తేల్చగా, తీవ్ర విమర్శలు రావటంతో మళ్లీ కమిటీ వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MRO Vanajakshi  MLA Chintamaneni Prabhakar  Attack Case  Enquiry Committee  

Other Articles