ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పిసీసీ ఛీప్ రఘువీరారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలవని ప్రజలు తమ ప్రభుత్వం అందించే ఫించన్లు తీసుకోవద్దని, తాము వేసిన రోడ్లపై నడవవద్దని చెప్పడంపై ఆయన తీవ్రస్తాయిలో ధ్వజమెత్తారు. పరిపాలనా పగ్గాలను ప్రజలు అందించారంటే వారికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించారన్న విషయాన్ని మర్చపోయారని దుయ్యబట్టారు. ప్రజలు కట్టే పన్నులు, ఇత్యాధుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా భర్తీ అవుతుందని, దాని నుంచి డబ్బులు వెచ్చించి ప్రభత్వాలు సంక్షేమ పనులు చేపడుతున్నాయని విషయాన్ని అధికార తెలుగుదేశం నేతలు మర్చిపోతున్నారని అయన మండిపడ్డారు.
ప్రజాధనంతో రాష్ట్రంలోని పేదలకు ఇస్తున్న ఫించన్ డబ్బును తీసుకోవాలంటే తమకే ఓటు వేయాలని బెదిరింపులకు పాల్పడుతున్న చంద్రబాబు.. వీధి రౌడీలా మాట్లాడుతున్నారని రఘువీరా విమర్శించారు. ఇవాళ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నీతులు చెప్పేవారు ముందు నీతిగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇస్తేనే చంద్రబాబు ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలోనే మంత్రి అయ్యి కోట్ల రూపాయలు లబ్ధి పొందారు. అన్ని ప్రయోజనాలు పొందిన చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి ఎంత కృతజ్ఞతతో ఉండాలి? అంటూ ప్రశ్నించారు. ఆయనే కృతజ్ఞతను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఇక టీడీపీలోకి రాణించి పదవిని ఇస్తే.. సొంతమామనే వెన్ను పోటు పొడిచిన చంద్రబాబు.. ఇప్పడు ప్రజలను బెదిరింపులకు గురిచేస్తారా..? ఆని నిలదీశారు.
తూర్పు గోదావరిలో ఉపముఖ్యమంత్రి చిన్నరాజప్ప చేసిన వ్యాఖ్యలను ఖండించి.. ఆయనపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. ఆయన మాటలనే ఏకంగా చంద్రబాబు కూడా అన్వయించడం సమంజసం కాదని అన్నారు. బాబు తన మాటల పై ప్రజలకు క్షమాపణ చెప్పాలని రఘువీరా డిమాండ్ చేశారు. రోడ్లు ఏమైనా హెరిటేజ్ డబ్బులతో వేశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీ, గిరిజనుల హక్కులను చంద్రబాబు కాల రాస్తున్నారని, మంత్రి వర్గంలో వారికి స్థానం కల్పించకపోవడం అన్యాయమని రఘువీరరెడ్డి అన్నారు.
(And get your daily news straight to your inbox)
May 17 | హర్యాణలో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఉదయం వేళ నడుస్తూ వెళ్తున్న ఓ కష్టజీవి గొంతు నులిమి నడిరోడ్డుపై దోపిడీకి పాల్పడ్డారు. హర్యానాలోని గురుగ్రామ్ లో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ... Read more
May 17 | కృష్ణా, రామా అని భగవంతుడి నామ జపం చేయాల్సిన వయస్సులోనూ ఓ వృద్దుడు తన మనవరాలి వయస్సులోని మైనర్ బాలికను లైంగికంగా వేధించాడు. దీంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఇలాంటి... Read more
May 17 | ఏమి జరిగినా మన మంచికే అన్న సూక్తిని పాటిస్తూ.. ధైర్యంగా ముందుకు నడిస్తే.. అపజయాలే విజయశిఖారాలుగా మారుతాయన్నది పెద్దల మాట. అందుకనే ధైర్యే సాహసే లక్ష్మీ అనే మాట కూడా పుట్టింది. ఈ సూక్తి... Read more
May 17 | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిందంబరం తనయుడు కార్తీ చిదంబరం నివాసంలో సెంట్రోల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబిఐ) మంగళవారం సోదాలు నిర్వహిస్తున్నది. కార్తీ చిదంబరం నివాసాలతో పాటు దేశవ్యాప్తంగా కార్యాయాలయాల్లో సోదాలు... Read more
May 17 | షరియా చట్టం అమలుజరిగే ఇస్తామిక్ దేశాల్లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో.. అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇరాక్, ఇరాన్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో అమలుపర్చే బహిరంగ శిక్షలు పలు సామాజిక మాద్యమాల్లోనూ... Read more