Andhra Pradesh Check Posts Closed due to GST

Ap govt new decision over gst implementation

Andhra Pradesh, Andhra Pradesh Government, AP Govt, AP Govt Check Posts, AP Close Check Posts, AP Govt GST Implementation, Yanamala GST Implementation, AP Govt Shut

GST Effect: Andhra Pradesh Government shut down Check Posts on July 1st. Adjust those employees in other departments Minister Yanamala said.

జీఎస్టీ ఎఫెక్ట్ ... ఏపీ ప్రభుత్వం కొత్త నిర్ణయం

Posted: 06/24/2017 10:44 AM IST
Ap govt new decision over gst implementation

జూలై 1 నుంచి దేశవ్యాప్తంగా జీఎస్టీ(గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) అదేనండీ దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి వస్తుందన్న విషయం తెలుసుకదా. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పన్నుల దోపిడీకి చెక్ పెట్టి, వినియోగదారులకు ఊరటనిచ్చే ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అయితే జీఎస్టీ మూలంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రతి ఏటా రూ. 2,920 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఏపీ ప్రభుత్వం తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను ఎత్తివేయాలని వాణిజ్య పన్నుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ నేపథ్యంలో దానిని అమలు చేయనున్నట్లు ఏపీ ఆర్థిక, వాణిజ్యపన్నుల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపాడు. ఆ ఆదేశాల ప్రకారం రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు ఈ నెల 30వ తేదీ అర్ధరాత్రి నుంచి మూతపడబోతున్నాయి. ఒకే పన్ను విధానం అమల్లోకి రానుండటంతో స్మగ్లింగ్ లాంటి వాటికి చెక్ పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో చెక్ పోస్టుల అవసరం లేకుండాపోతోంది.

ఇకపై చెక్ పోస్టుల్లో వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఇకపై ఉండదు. అయితే, అనుమానం వచ్చిన వాహనాలను మాత్రం మార్గమధ్యమంలోనే ఎక్కడైనా ఆపి తనిఖీలు చేస్తారు. ఇక చెక్ పోస్టుల్లో ఇప్పుడు పని చేస్తున్న ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని, వారిని వాణిజ్య పన్నుల శాఖలోని ఇతర విభాగాల్లో సర్దుబాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Check Posts  GST Effect  

Other Articles