Meet upma, the dish that caused a national outrage సోషల్ మీడియాలో మరో ఉద్యమం ప్రారంభం..

Meet upma the dish that caused a national outrage

Upma, R Parthiban, national dish, versus, ago, upma, food, caused, national, dish, indian, tv, outrage, meet, twitter, south, south inidan dish, food and health, nation popular dish, international reputation

The dish skulking grimly in the corner of every South Indian buffet, suggest it should become our national dish. Love it or hate it, you can’t ignore it

సోషల్ మీడియాలో మరో ఉద్యమం ప్రారంభం..

Posted: 06/23/2017 11:42 AM IST
Meet upma the dish that caused a national outrage

దక్షిణాది ప్రజల వంటకాల్లో అతిపురాతనంగా వస్తున్న వంటకం.. ఉప్మా. కొత్తదనానికి తగ్గట్టుగా ఉప్మా పెసరట్టు. జీడిపప్పు ఉప్మా. ఉప్మా దోస. ఇలా ఏ ఫలహారపు వంటలోనైనా అలా చేరి నోటికి రుచిని, దేహానికి శక్తిని ఇచ్చే వంటకం ఉప్మా అంటే అతిశయోక్తి కాదు. దేశ ప్రజలకు ఎంతగానో ఇష్టపడే ఉప్మాకు ఇప్పుడు అంతర్జాతీయ ప్రాముఖ్యత లభిస్తున్నది. అదెలా అంటే.. ఉప్మాను జాతీయ వంటకంగా ప్రకటించాలంటూ జోరుగా ప్రచారం సాగుతున్నది. ఈ ప్రచారం సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ వేదికగా ప్రారంభమైంది.

ప్రముఖ భారతీయ చెఫ్ లైనా ఫ్లాయిడ్‌ కార్డోజ్, ఆరతి సంపత్ ల కారణంగా అమెరికాలో కూడా డిష్‌కు ఎంతో పేరు వచ్చింది. ఉప్మాకున్న ప్రత్యేక గుణమేమంటే ఎలా చేసినా బాగుంటుంది. కొందరు ఉప్మాను పొపు గింజలు, మసాలదినుసులు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చి మిరపకాయలు, ఉల్లిపాయలతో సాదా సీదాగా చేస్తే, మరికొందరు పల్లీలు, కాజు, బఠానీలు జోడిస్తారు. ఇంకొందరు వాటికి టమోటా, బీన్స్, పుట్టగొడుగులు కలిపి చేస్తారు. కొందరు మామూలు నూనెతో చేస్తే మరికొందరు నెయ్యితో చేస్తారు. పచ్చి కొబ్బరి పాలతో కూడా చేస్తారు. ఇంకొందరు మాంసం, చేపలతో ఉప్మా తయారు చేస్తారు.

తమిళ నటుడు, దర్శకుడు రాధాకష్ణన్ ప్రతిబన్ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉప్మాను జాతీయ వంటకంగా ప్రకటిస్తే బాగుంటుందని మొదట ప్రతిపాదించారు. తాను సహాయ దర్శకుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టినప్పుడు కాలే కడుపును ఉప్మాతో ఎలా నింపుకుని అకలిని తీర్చుకున్నారో చెప్పారు. ఆ రోజుల్లో ఎంతోమంది సహాయ దర్శకులు ఆర్థిక స్థోమత అంతగాలేక ప్రతిరోజూ ఉప్మాతోనే జీవించే వారని కూడా చెప్పాడు. ఇప్పుడు కూడా సినీ పరిశ్రమలో ఆ పరిస్థితి ఉందని చెబుతారు. ఆయన సరదాగా అన్న మాటాలు కాస్తా ఏకంగా ఉద్యమంగా మారుతున్నాయి. ఉప్మాను జాతీయ వంటకంగా ప్రకటించాలని ఏకంగా ట్విట్టర్ వేధికగా సామాజిక ఉద్యమం ప్రారంభమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles