India best in 4G availability and worst in download

Reports on 4g network in india

India, India Internet, India Internet Speed, India 4G Network, 4G Network Speed, 4G Network Download India, 4G Network OpenSignal Survey, Internet Speed and Download, India best in 4G

India is among the world's best when it comes to availability of 4G networks, or proportion of time users have access to a 4G network, But Worst in Download. According to OpenSignal, a company that collates crowd-sourced data on performance of mobile networks in major countries.

నెట్ వర్క్ సూపర్.. డౌన్ లోడ్ వరస్ట్

Posted: 06/22/2017 12:10 PM IST
Reports on 4g network in india

ఇంటర్నెట్ వాడకంలో ప్రపంచంలో  టాప్-5 దేశాల్లో కొనసాగుతూ వస్తున్న భారత్.. మరి ఆ సేవలు అందించటంలో ఎలా ఉందో కూడా తెలుసుకోవాలి కదా. ఓపెన్ సిగ్నల్ అనే కంపెనీ ప్రపంచంలోని అగ్ర దేశాలలో వివిధ నెట్ వర్క్ ల పనితీరును అధ్యయనం చేసి ఓ నివేదికను వెలువరించింది. ఈ లిస్ట్ లో ఇండియాలో 4జీ నెట్‌వర్క్ లభ్యత విషయంలో టాప్ పొజిషన్ లో ఉన్నట్లు తెలిపింది.

అవును అమెరికా, జపాన్, నార్వే లాంటి ఇంటర్నెట్ దిగ్గజ దేశాల సరసన ఇండియా నిలిచింది. అయితే డౌన్ లోడింగ్ వేగంలో మాత్రం పరమ చెత్తగా ఉందని వెల్లడి కావటం విశేషం. 4జీ లభ్యత విషయంలో దక్షిణ కొరియా 96.4 శాతంతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో జపాన్ (93.5 శాతం), నార్వే (87.0 శాతం), అమెరికా (86.5 శాతం), ఇండియా (81.6శాతం) నిలవగా, భారత్ తర్వాతి స్థానంలో యూకే, జర్మనీ, ప్రాన్స్, ఐర్లాండ్, ఈక్వెడార్‌లు వరుసగా నిలిచాయి. ఈ విషయంలో ఏషియన్ కంట్రీ శ్రీలంక 40.1 శాతంతో అట్టడుగున నిలిచింది.

4జీ లభ్యత విషయంలో చాలా దేశాల కంటే మెరుగ్గా ఉన్న భారత్ సగటు డౌన్‌లోడింగ్ వేగంలో దారుణంగా ఉంది. ఈ విషయంలో సింగపూర్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండగా భారత్ మాత్రం దానికంటే తొమ్మిదిరెట్లు తక్కువగా ఉంది. ఈ విషయంలో సింగపూర్ 45.6 ఎంబీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా (43.5 ఎంబీపీఎస్), హంగేరీ (42.6 ఎంబీఎస్) జపాన్ (24.5), ఫ్రాన్స్ (24.2), యూకే (22.7), జర్మనీ (20.5), అమెరికా (15.0), ఇండోనేసియా (7.7) వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. డౌన్‌లోడ్ వేగంలో 5.1 ఎంబీపీఎస్ వేగంతో కోస్టారికా, భారత్‌లు కింది నుంచి తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  4G Network  Speed and Download  

Other Articles