Jio Customers use it as Secondary Connection Only

Big shock to jio from customers

Jio Customers, Velocity MR, Velocity MR Jio Survey, 18% of Reliance Jio Customers, Jio Customers Data SIM, Jio Customers Secondary SIM, Jio Customers, Reliance Jio First SIM 18%, Jio Only Data SIM

Only 18% of Reliance Jio Infocomm's customers are using their connections as a standalone SIM while a whopping 82% are still using it as their second SIM, Bengaluru-based market research agency, Velocity MR, said in a study Monday

జియోకు షాకిస్తున్న కస్టమర్లు

Posted: 06/20/2017 09:01 AM IST
Big shock to jio from customers

టెలికాం రంగంలో ఒక్కసారిగా జియో తెచ్చిన సంచలన మార్పులు తెలిసిందే. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల జమానాకు అనుగుణంగా డేటా ప్యాకేజీల విషయంలో ఫ్రీ, ఆపై భారీ డిస్కౌంట్ లతో కస్టమర్లు ఎగబడిపోయారు. తర్వాత అన్ని నెట్ వర్క్ లు కూడా ఇలా దిగిరావాల్సి వచ్చింది. అయితే తాజా గణంకాలు మాత్రం జియోకు కాస్త నిరాశ కలిగిస్తున్నాయి.

వినియోగదారుల్లో కేవలం 18 శాతం మందే సిమ్‌ను మొదటి సిమ్‌గా ఉపయోగిస్తుండగా 82 శాతం మంది రెండో సిమ్‌గా ఉపయోగిస్తున్నట్టు బెంగళూరుకు చెందిన మార్కెట్ రీసెర్చ్ ఏజెన్సీ వెలోసిటీ ఎంఆర్ పేర్కొంది. 86 శాతం మంది ఖాతాదారులు జియోను కొనసాగించడానికి కారణం ఉచిత ఆఫరేనని వెలోసిటీ పేర్కొంది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సర్వేలో పాల్గొన్న చాలామంది జియో కాల్ రేట్లు, డేటా ప్యాకేజీలు, ఇంటర్నెట్ స్పీడ్ ఇతర కంపెనీలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో 2 వేల మందిపై వెలోసిటీ సర్వే నిర్వహించింది. ఇక కాల్‌ డ్రాప్స్ విషయంలో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా, బీఎస్ఎన్ఎల్ కంటే మెరుగైన స్థానంలో జియో నిలిచింది. అవి వరుసగా 56, 57, 57, 59 శాతంతో ఉండగా జియో 54 శాతం కాల్ డ్రాప్స్ నమోదు చేసింది.

జియో దెబ్బకు మిగతా నెట్ వర్క్ లు వెలవెల బోతున్నాయన్నది ఒప్పుకుని తీరాల్సిన విషయమే. అయితే, విస్తారంగా ఉన్న టెలికాం రంగంలో ఇది దీర్ఘకాలికంగా పోటీ ఇవ్వటం కష్టమైన అంశమే అని వెలోసిటీ ఎంఆర్ ప్రతినిధి జసల్ షా పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Reliance Jio  Secondary SIM  

Other Articles