Union Minster Eagerly Waiting for Hurl Eggs

Omelettes out of eggs hurled at me

Babul Supriyo, Babul Supriyo Singer, Babul Supriyo Hurl Eggs, Hurl Eggs Omlet, Babul Supriyo Omelette, Omelette , Babul Supriyo, Union Minster Hurled Eggs, Odisha West Bengal Babul Supriyo, Union Minister Babul Supriyo

Babul Supriyo: I'll make omelettes out of eggs hurled at me. Taking a sarcastic jibe on BJD leaders for attacking Union Minister Jual Oram with eggs, Union Minister of State for Heavy Industries Babul Supriyo today said he is not afraid to face any such attack during his visit to Odisha.

ప్లీజ్.. నాపై గుడ్లు వేయండి!

Posted: 06/16/2017 09:54 AM IST
Omelettes out of eggs hurled at me

ఛాన్స్ దొరికిన ప్రతీసారి మిత్రపక్షాలతో కలిసి కేంద్రంలోని బీజేపీని ఇరకాటంలో పెట్టాలనే కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది. అయితే తాము చేసే అభివృద్ధి పనులతో వాళ్ల ఆరోపణలు గాల్లోనే కొట్టుకుని పోతాయంటున్నాడు బెంగాలీీ సింగర్, భారీ పరిశ్రమల శాఖ(మినిస్టర్ ఆఫ్ స్టేట్) మంత్రి బాబుల్ సుప్రియో. ఒడిశా పర్యటనలో ఉన్న బాబుల్ మంత్రులపై జరుగుతున్న దాడులపై సీరియస్ గా స్పందించాడు.

మూడు రోజుల క్రితం మహానది జల వివాదం పై చర్చించేందుకు కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జుయల్ ఓరం, కేంద్రపారా జిల్లాలోని అవుల్ బజార్ కు వెళ్లాడు. మందాసార్ ఘటనకు వ్యతిరేకంగా బీజేడీ, కాంగ్రెస్ ఆందోళనలు నిర్వహించాయి. ఈ క్రమంలో బీజేడీ కార్యకర్తలు మంత్రి కాన్వాయ్ పై గుడ్లు విసిరి కొట్టగా, కాంగ్రెస్ నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేసింది. దీనిపై బాబుల్ ఘాటుగానే స్పందించాడు. 

తాను మాంసాహారినని, ఒకవేళ ఎవరైనా తనపై గుడ్లు విసిరితే వాటితోనే ఆమ్లెట్‌ వేసుకుంటానని బాబుల్‌ సుప్రియో పేర్కొన్నాడు. ఇలాంటి చర్యలతో భయపెట్టాలని భావిస్తే, తనలో ఇసుమంతైనా భయం కలగదని అన్నారు.ఇక్కడి( ఒడిశా) కంటే ఎక్కువ రాజకీయ సమస్యలు, స్తబ్థత ఎక్కువగా ఉన్న పశ్చిమ బెంగాల్ నుంచి తాను వచ్చానని, ఎవరూ తనను భయపెట్టలేరని బాబుల్ స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Minster  Babul Supriyo  Odisha Tour  Hurl Eggs  

Other Articles