Ready For Mid-term Polls, Says Maha CM మధ్యంతర ఎన్నికలకు సిద్దమేనన్న ముఖ్యమంత్రి

We are ready for mid term polls maha chief minister shocks ally

Devendra Fadnavis, Maha Chief Minister shocks ally, Shiv Sena attacks BJP, Presidential Elections, Mid-term elections, Mid-term polls, Maharashtra mid-term polls, BJP, BJP unit, Chief Minister Devendra Fadnavis, Devendra Fadnavis, farmers, maharashtra, mid term polls

Chief Minister Devendra Fadnavis said BJP unit in Maharashtra is prepared for mid-term polls, in Maharashtra amid farmers' stir seeking loan waiver in view of the agrarian crisis.

మధ్యంతర ఎన్నికలకు మేము సిద్దమే: ముఖ్యమంత్రి

Posted: 06/15/2017 12:00 PM IST
We are ready for mid term polls maha chief minister shocks ally

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పడు ఎన్నికలు జరిగినా.. తమ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందని, గతంలో కన్నా రెట్టింపు స్థాయిలో ఎమ్మెల్యేలను గెలుచుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసిన నేపథ్యంలో మధ్యంతర ఎన్నికలకు వెళ్తారా..? అంటే అందుకు ససేమిరా.. అన్నాయి ప్రభుత్వ వర్గాలు. అయితే ఇదే స్ర్కాప్ట్ ను ఫాలో అవుతూ.. తమను నిత్యం వేధిస్తున్న మిత్రపక్షానికి షాక్ ఇచ్చారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నావిస్. మహారాష్ట్రలోని బీజేపి వర్గాలు మధ్యంతర ఎన్నికలకు సిద్దంగా వున్నాయని అయన చెప్పుకొస్తూ శివసేనను విస్మయానికి గురిచేశారు.

మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే తమ పార్టీ అందుకు సిద్ధంగా ఉందని అన్నారు. మధ్యంతర ఎన్నికలు జరిగినా తమ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఘంటాపథంగా చెప్పారు. జూలై లోపు మహారాష్ట్ర రైతుల రుణాలను మాఫీ చేయని పక్షంలో తాము విపరీత నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని శివసేన హెచ్చరించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన సీఎం ఫడ్నావిస్ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

రుణమాఫీ చేయాలంటూ మహారాష్ట్రలోని ఇటీవల రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడంతో వారి డిమాండ్లకు దిగొచ్చిన ప్రభుత్వం రుణమాఫీని ప్రకటించింది. అయితే ఆ సమయంలో ఫడణవీస్‌ ప్రభుత్వంపై విపక్షాల నుంచే గాక, కూటమి పార్టీల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తాయి. రైతులను నమ్మించి నట్టేట ముంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటూ.. అరోపించాయి. అందోళన సమయంలో రైతుల సమస్యలు తీర్చకపోతే ప్రభుత్వాన్ని పడగొట్టాల్సి వస్తుందని మిత్రపక్షమైన శివసేన కొంత ఘాటుగానే హెచ్చరించింది. అంతేకాదు రుణమాఫీకి జులై నెలను డెడ్ లైన్ గా పెట్టింది. దీంతో రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారన్న వూహాగానాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఫడణవీస్‌.. వూహాగానాలపై క్లారిటీ ఇచ్చారు. ‘రైతుల ఆందోళన జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి తమ మద్దతును ఉపసంహరించుకుంటామని చెప్పారని ఏకంగా శివసనే పార్టీని టార్గెట్ చేస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా అన్నారు. అయితే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. అందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫడ్నావిస్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలమన్న విశ్వాసం తమకుందని ధీమా వ్యక్తం చేశారు. రుణమాఫీ చేద్దామనుకున్నాం.. కానీ మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు అది సాధ్యం కానివ్వలేదన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి.. మరో ఐదేళ్ల పూర్తి అధికారమిస్తే ఖచ్చితంగా రుణమాఫీలు అమలు చేస్తామన్న ఎత్తుగడలో భాగంగానే ఫడ్నావిస్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు బావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles