Leopard barges into girls hostel in Mumbai అర్థరాత్రి అమ్మాయిల హాస్టల్ లో ఏం పని..!

Leopard barges into bombay veterinary college girls hostel kills dog

leopard in girls hostel, leopard mumbai girls hostel, bombay veternary collage girls hostel, leopard, mumbai, sanjay gandhi park, leopard attack, aarey milk colony, bombay veterinary college, latest news

A leopard was caught on CCTV barging into a Bombay Veterinary college girls hostel and attacked a dog on the steps of the hostel.

ITEMVIDEOS: అర్థరాత్రి అమ్మాయిల హాస్టల్ లో ఏం పని..!

Posted: 06/14/2017 11:46 AM IST
Leopard barges into bombay veterinary college girls hostel kills dog

అర్థరాత్రి వేళ అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చిన ఓ అగంతకురాలు అక్కడ కాపలా కాస్తున్న శునకంపై తన ప్రతాపాన్ని చూపింది. అసలు అర్థరాత్రి వేళ అమ్మాయిల హాస్టల్ లో దానికేం పని అన్నది అర్థం చేసుకోవచ్చు. అయితే అమ్మాయిల హాస్టల్ గేట్లు మూసివేసి వుండటంతో.. లోనికి రాలేదు.. కానీ అధికారులు ఏమాత్రం అదమర్చినా.. హాస్టల్ లో విషాదం చోటుచేసుకుని వుండేది. అంతేకాదు.. అర్థరాత్రి వేళ అమ్మాయిలు హాహాకారాలు, అర్థానాధాలు ఎంతగా పెట్టినా.. నిర్జన, నిర్మానుష్య ప్రాంతంలో అవి అరణ్యరోదనగానే మిగిలేది. ఇంతకీ అమ్మాయిల హాస్టల్ లోకి వచ్చిన అ అగంతకురాలు ఎవరు..?

ముంబైలోని వెటర్నరీ కళాశాల అమ్మాయిల హాస్టల్ లోకి అర్థరాత్రి వేళ ఓ చిరుత ప్రవేశించింది. సంజయ్ గాంధీ జాతీయ వన్యప్రాణుల పార్కు సమీపంలో వున్న ఈ హాస్టల్ లోకి నిర్జన, నిర్మానుష్య సమయాల్లో పలు క్రూర జంతువులు క్యాంపస్ లోకి వస్తుంటాయి. దీంతో అధికారులతో పాటు హాస్టల్ లో నివసించే అమ్మాయిలు కూడా నిత్యం అప్రమత్తంగా వుంటారు. మరీ ముఖ్యంగా సాయంత్రం వేళ నుంచి తెల్లవారు జాము వరకు వీరు చిన్న అలికిడి అయినా లేస్తారు. అయితే విషయం తెలిసిన అధికారులు మాత్రం వన్యప్రాణులు హాస్టల్ లోకి ప్రవేశించకుండా పలు రక్షణ చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో సీసీటీవీ ఫుటేజ్ లో నిక్షిప్తమైన దృశ్యాలను షాకింగ్ దృశ్యాలను బయటపెట్టాయి. గత శుక్రవారం హాస్టల్ లోకి ప్రవేశించిన చిరుత, కాపలా కుక్కలపై దాడికి దిగింది. హాస్టల్ మెట్లపై నుంచి ఓ శునకాన్ని చిరుత తరిమింది. దానిపై దాడికి దిగింది. ఆ శునకాన్ని రక్షించేందుకు వచ్చిన మరో శునకం, చిరుతను చూసి భయంతో వెనక్కు తప్పుకుంది. ఆపై గోరేగావ్ అటవీ ప్రాంతంలోకి చిరుత పారిపోయింది. కాగా, హాస్టల్ లోకి వస్తున్న వన్యప్రాణులు, క్రూరమృగాలతో తాము నిత్యం భయాందోళనలో మగ్గాల్సి వస్తుందని, రాత్రుళ్లు వాటి అరుపులతో తాము భయపడుతున్నామని హాస్టల్ బాలికలు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles