minister narayana swachh ap suprise visit in ongole మంత్రి నారాయణ కూడా సినీమా పోస్టర్లను చించేశారు

Minister narayana swachh ap suprise visit in ongole

minister narayana, ongole tour, raj tarun, andhagadu, movie poster, prakasam, swachh andhra pradesh

Andhra pradesh minister narayana shocks officials with suprise visit in ongole, tares movie posters and orders to fine those who sticks posters on walls.

మంత్రి నారాయణ కూడా సినీమా పోస్టర్లను చించేశారు

Posted: 06/10/2017 06:28 PM IST
Minister narayana swachh ap suprise visit in ongole

సాంకేతిక విప్లవంతో స్మార్ట్ పోన్లు, వెబ్ పోర్టల్స్ అందుబాటులోకి వచ్చాక మనకు నగరాలు, పట్టణాల్లో అంతగా కనిపించడం లేదు కానీ, 80, 90 దశబ్దాలలో ఎక్కడ చూసినా ఏ ప్రధాన కూడలి చూసినా సినిమా పోస్టర్లు దర్శనమిచ్చేవి. అంతేకాదండోయ్ హీరోలా అభిమాన సంఘాలు ఒక హిరో చిత్రం పోస్టర్ ను చించితే, మరో హీరో పోస్టర్ ను మరో అభిమాన సంఘాలకు చెందిన అభిమానులు చించేవారు, పేడ కోట్టేవారు, ఇలా హిరో అభిమాన సంఘాల మధ్య తీవ్ర పోటీ నెలకొనేంది. ఇప్పడంతా నెట్ లోనే దర్శనమిస్తుందనుకోండి.

అయితే అంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కూడా ఇవాళ ఓ హీరో నటించిన చిత్రం పోస్టర్ ను చించేశారు. అయితే మంత్రి నారాయణ ఎవరి అభిమాని.. తమ హీరోకు ఆయన చించిన పోస్టర్ హీరో ప్రత్యర్థేనా.. ఇలాంటి ప్రశ్నలు వేసుకోకండి, ఎందుకంటే మంత్రి నారాయణ హీరో అభిమానిగా పోస్టర్ ను చించివేయలేదు. బాధ్యతాయుతమైన మంత్రిగా అంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వఛ్చా రాష్ట్రంగా తీర్చిదిద్దే క్రమంలో ఆయన గోడలపై అంటించిన సినిమా పోస్టర్లను చించివేశారు.

ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో ఆకస్మిక తనిఖీలు చేసిన ఆయన ఈ సంద‌ర్భంగా నగర సుంద‌రీక‌ర‌ణ ప‌నుల‌ను గురించి తెలుసుకుంటూ డీఎంఏ కన్నబాబుతో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌కు న‌గ‌రంలోని గోడ‌ల‌పై సినిమా పోస్ట‌ర్లు అంటించి ఉండ‌డం కనిపించింది. రాజ్ తరుణ్-హెబ్బాపటేల్ కాంబినేషన్లో ఇటీవ‌ల విడుద‌లైన ‘అంధగాడు’ సినిమా పోస్టర్‌లు గోడ‌ల‌పై అంటించి, గోడ‌ల‌ను పాడు చేయ‌డం ప‌ట్ల ఆయ‌న ఆగ్ర‌హం వ్యక్తం చేశారు.

ఆయనే స్వయంగా ఆ సినిమా పోస్ట‌ర్ల‌ను చించేశారు. నిబంధనలకు విరుద్ధంగా గొడలు, విద్యుత్ స్థంబాలు, ప్రహరీ గోడలపై సినిమా పోస్టర్లతో పాటు ఏ విద్యాసంస్థల పోస్టర్లు, అస్పత్రుల పోస్టర్లు, ఇలా తమ పోస్టర్ల ద్వారా తమ వ్యాపారాన్ని అభివృద్ది చేసుకోవాలనుకునే వారందరిపై చర్యలు తీసుకోవాలని అదేశించారు. రాష్ట్రంలో పోస్టర్లు కన్పించకూడదని, ఈ నెల 5న ప్రభుత్వం అంధ్రప్రదేశ్ ను పోస్టర్ల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాల‌ని ప్రకటన చేసింద‌ని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఫైన్ వేయాల‌ని సూచించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : minister narayana  ongole tour  raj tarun  andhagadu  movie poster  prakasam  swachh andhra pradesh  

Other Articles