Eggs hurled at Agriculture Minister Radha Mohan Singh's car కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ కు చేదు అనుభవం

Eggs hurled at agriculture minister radha mohan singh s car in odisha

Union Agriculture Minister, Eggs hurled, Radha Mohan Singh, Odisha, Mandsaur, madhya pradesh, bhivaneshwar, black flags, youth congress, protest

Five people have been arrested for throwing eggs at Union Agricultural Minister Radha Mohan Singh's vehicle in Bhubaneswar.

కేంద్ర మంత్రి కారుపై గుడ్ల వర్షం.. నల్లజెండాల నిరసన

Posted: 06/10/2017 05:44 PM IST
Eggs hurled at agriculture minister radha mohan singh s car in odisha

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌కు చేదు అనుభ‌వం ఎదురైంది. మధ్యప్రదేశ్ లో గిట్టుబాటు ధర కోసం అందోళన చేస్తున్న రైతులపై అక్కడి ప్రభుత్వం తూటాలను ఎక్కుపెట్టి వారి ప్రాణాలను బలితీసుకున్న నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం యోగా చేస్తూ సరదగా కనబడటం అన్నదాతలు అసువులు బాసినా పట్టించుకోకపోవడంతో ఆయనకు పరాభవం ఎదురైంది. ఒడిశా పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రిని యువజన కాంగ్రెస్ నేతల చేతిలో చేధు అనుభవాన్ని చవిచూశారు.

రాష్ట్రంలోని  స్టేట్ గెస్ట్‌హైస్ సమీపంలో రాధామోహన్ సింగ్ వాహనంపై యువజన కాంగ్రెస్ కార్యకర్తలు శనివారంనాడు కోడిగుడ్లు రువ్వారు. మధ్యప్రదేశ్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతి చెందిన ఘటనకు నిరసనగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన జరిపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో రైతులు ప‌డ‌రాని పాట్లు ప‌డుతున్నారని, కేంద్ర ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని యూత్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్టేట్ గెస్ట్ హౌస్ నుంచి మంత్రి బయలుదేరినప్పడు కోడిగుడ్ల దాడి ఘటన చోటుచేసుకుంది. దాడి అనంతరం రంగంలోకి దిగిన పోలీసులు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు లోక్‌నాథ్ మహారథి సహా ఐదుగురిని అరెస్టు చేసి కేసులు నమోదు చేశారు. మధ్యప్రదేశ్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతి చెందిన ఘటనకు నిరసనగా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన ప్రదర్శన జరిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Agriculture Minister  Eggs hurled  Radha Mohan Singh  Odisha  Mandsaur  

Other Articles