Man sparks alert after overheard rehearsing lines about weapons రైలు బాత్రూమ్ లో నటుడు చేసిన పనితో బెంబేలు..!

Man sparks alert after overheard rehearsing lines about weapons

france terror alert,Mistaken Terrorist,French Actor Questioned,France State of emergency,Paris security alert,Actor Questioned, Actor, train, toilet, Rehearsal, French train, terror alert, gun, weapon

A terror alert was sparked on a train in France after a conductor heard the English words ‘gun’ and ‘weapon’ being spoken by someone inside the toilet cubical

రైలు బాత్రూమ్ లో నటుడు చేసిన పనితో బెంబేలు..!

Posted: 06/09/2017 10:50 AM IST
Man sparks alert after overheard rehearsing lines about weapons

మెట్రో రైలులో ఓ ప్రయాణికుడు అదే రైలులోని బాత్రూమ్ లో నటుడు చేసిన పనితో షాక్ అయ్యాడు. అంతటితో అగకుండా అధికారులకు నటుడి అనుమానాస్పద వ్యాఖ్యలపై అధికారులకు పిర్యాదు చేయడంతో  ఫ్రాన్స్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకీ, ఆయుధాలు అంటూ బాత్రూమ్‌లో మాట్లాడిన నటుడిని ఉగ్రవాదిగా భావించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై అతడు నటుడని, మూవీ డైలాగ్ ప్రాక్టీస్‌లో భాగంగా కొన్ని పదాలు వాడినట్లు తెలుసుకుని విచారణ అనంతరం వదిలేశారు. అసలే 2015 నవంబర్‌లో జరిగిన మారణహోమాన్ని ఫ్రాన్స్ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు.

ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.... ఓ హాలీవుడ్ చిత్రంలో ఫ్రాన్స్‌ కి చెందిన నటుడు తాను నటించబోయే ఇంగ్లిష్ సినిమా కోసం మెట్రోరైలులోని ఒక బోగీ బాత్రూంలో కూర్చుని డైలాగులు వల్లేవేసుకుంటున్నాడు, ఆ డైలాగుల్లో వెపన్, గన్ వంటి ఆంగ్ల పదాలు కూడా వున్నాయి. అదే సమయంలో టాయ్ లెట్ కని వెళ్లిన మరో ప్రయాణికుడు వాటిని విన్నాడు. వెంటనే రైలు అధికారులను అప్రమత్తం చేసేందుకు సైరన్ మోగించాడు. అనుమానాస్పద వ్యక్తి ఎవరితోనో బాత్రూంలో ఆయుధాల గురించి మాట్లాడుతున్నాడని పోలీసులకు సమాచారం అందించాడు.

దీంతో ఉగ్రదాడి జరుగుతుందోమోనని భావించిన భద్రతా సిబ్బంది ప్యారిస్ లో హై అలర్ట్ ప్రకటించిన అనంతరం ఆర్టిస్ట్ ను అదుపులోకి తీసుకుని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. హాస్యనటుడిగా ప్రాచూర్యం పోందిన నటుడు హాలీవుడ్ మూవీలో నటిస్తున్నాడని అందులో భాగంగానే డైలాగ్స్ ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. రైలు బోగీలో డైలాగ్స్ గట్టిగా చదువుతూ ప్రాక్టీస్ చేస్తే తోటి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని ఈ పని చేశానని వివరణ ఇచ్చాడు.

దీంతో అతను చెప్పేది నిజమని నిర్ధారించుకున్న పోలీసులు, చివరికి అతనిని విడిచిపెట్టారు. కాగా, 2015 నవంబర్‌ లో ఐసిస్ ఉగ్రదాడులు పేట్రోగిపోవడంతో జరిగిన పారిస్‌ ఉగ్రదాడుల్లో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. రెండేళ్ల లోపే మరో ఉగ్రదాడి జరుగుతుందని భావించి రంగంలోకి దిగిన పోలీసులు.. వేగంగా స్పందించి నటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసులు ఫ్రాన్సు వాసులకు కూడా విషయాన్ని చెప్పారు. అతడు ఉగ్రవాది కాదని, నటుడని.. ఆందోళన అక్కర్లేదని పోలీసులు మీడియా ద్వారా ప్రజలకు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actor  train  toilet  Rehearsal  French train  terror alert  gun  weapon  

Other Articles