Alarm as fake plastic rice enters market ఏక్కడెక్కడ ఏమి తింటున్నారో.. జాగ్రత్త సుమీ..

Plastic rice fat oil perished meat fears eaters in telugu states

plastic rice, perished meat, fat oil, duplicate pulses, eaters, hyderabad, telugu states, hotels, restarants, food and dining

After fat oil, perished meat, now plastic rice scares eaters in hyderabad and telugu states, doctors say that it is very dangerous to consume plastic rice

ఏక్కడెక్కడ ఏమి తింటున్నారో.. జాగ్రత్త సుమీ..

Posted: 06/06/2017 04:43 PM IST
Plastic rice fat oil perished meat fears eaters in telugu states

పైన దగా కింద దగా, కుడి ఎడమల దగా, దగా అన్నట్లుగా.. కాసులు రావాలే కానీ మట్టిని కూడా ప్యాక్ చేసి మాయమాటలతో విక్రయించి వ్యాపారం చేసేస్తారు కేటుగాళ్లు. ఇప్పటికే పశువుల వ్యర్థాలు, యముకలతో కల్తీ నూనెను తయారు చేయించి విక్రయిస్తున్న బాగోతం బయటపటడంతో అధికారులు అకస్మిక తనిఖీలకు పనిచెబుతున్నారు. తాజాగా అధికారులు జరిపిన తనిఖీల్లో అనేక హోటళ్లలో కుళ్లిపోయిన మాంసాన్ని నిల్వచేసి.. అర్డర్ రాగానే దానినూ తీసి వండివార్చి వడ్డీస్తున్నారన్న విషయం బయటపడింది.

దీంతో వీకెండ్ లో హోటళ్లకు వెళ్లి సరదాగా కుటుంబంతో ఎంజాయ్ చేయాలనుకునేవారు జంకుతున్నారు. ఈ క్రమంలో అనేక హోటళ్లలో ఇలాంటి నాణ్యత లోపించిన మాంసంతోనే వంటలు చేస్తున్నారని నగరంలోని సుమారు 60 హోటళ్లకు పైగా జరిమానాలు విధించిన అధికారులు పలు హోటళ్లను సీజ్ కూడా చేశారు. ఇప్పటికే అడ్డదారుల్లో అప్పనంగా జనారోగ్యంతో అటలాడుకుంటూ డబ్బులను సోమ్ముచేసుకుంటున్న వైనం తెలిసిన సగటు బోజన ప్రియులు ఇక ఇళ్లకే పరిమితం కావాలని నిర్ణయానికి వచ్చారు.

ఈ తరుణంలో మరో విషయం బయటకు వచ్చింది. దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ గుడ్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇక కోడిగుడ్డను తింటే రోగనిరోధక శక్తి మాట దేవుడెరుగు కానీ రోగాలు వస్తాయన్న భయంతో ఇక కోడిగుడ్ల జోలికి కూడా ఎవరూ వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడే దానిని మర్చిపోతున్న క్రమంలో తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ప్లాస్టిక్ బియ్యం బాగోతం బ‌య‌టప‌డింది. ప్లాస్టిక్ రైస్ అమ్మకాల‌పై ఇరు రాష్ట్రాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. హైద‌రాబాద్‌, శ్రీ‌శైలం స‌హా ప‌లు ప్రాంతాల్లో ఫిర్యాదులు వ‌చ్చాయి.

ఈ పిర్యాదులపై కదిలిన అధికార, పోలీసు యంత్రాంగం.. ఈ బియ్యం ఎక్కడి నుంచి సరఫరా అయ్యింది.. ఎవరెవరికీ సరఫరా అయ్యాయన్న విషయాలను చేధిస్తూ.. ఏకంగా డొంకనే కదిలించే పనిలో వున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్లాస్టిక్ రైస్ బ‌స్తాల‌ను సీజ్ చేశారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వ్యాపారుల‌పై క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామ‌ని వెల్లడించారు. ఇదిలావుంటే.. ఈ బియ్యంతో వడిన అహారాన్ని తీసుకుంటే అనేక అరోగ్య సమస్యలు వస్తాయని అధికారులు తెలిపారు. వీటిని తీసుకుంటే అజీర్తి, కడుపు ఉబ్బరంతో వెంటనే రాగా, భవిష్యత్తులో అనేక అనారోగ్యాలకు ఇవి దారితీస్తాయని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles