Andhra Pradesh snaps power to Telangana

Ap government stop power supply to telangana

Telangana Genco Dues, Telangana Andhra Pradesh Power Supply, Telangana AP Genco, AP Genco Telangana Government, Telangana Electricity Dues to AP, KCR Power Supply, AP Power Supply, AP Telangana Electricity War, Chandrababu Naidu Peddapalli Station

Andhra Pradesh stop Power Supply to Telangana. AP Genco has served a final notice to Telangana Genco to pay the 3138 Crore pending money. The actual amount is 4498 Crore but AP has to pay 1360 Crore to Telangana Genco. The notice said if the dues are not settled power supply stopped already. Complaint on Chandrababu over Black Day Comments in Peddapalli Police Station

తెలంగాణకు పవర్ కట్.. బాబుపై ఫిర్యాదు

Posted: 06/06/2017 09:47 AM IST
Ap government stop power supply to telangana

విభజన తర్వాత విపరీతమైన బకాయిలు పెరిగిపోవటంతో తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సిన కరెంట్ ను నిలిపేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో రెండేళ్ల క్రితమే హస్తిన వెళ్లి జోక్యం చేసుకోవాలని హోం మంత్రిత్వ శాఖను కోరినప్పటికీ ఫలితం లేకపోవటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో మంగళవారం టీఎస్ ట్రాన్స్ కో అధికారులకు ఓ లేఖ కూడా అందింది.

తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మే 25నే ఆఖరిసారిగా నోటీసు పంపింది. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ సరఫరాను కొనసాగిస్తామని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి సుమారు 5వేల కోట్ల బకాయి రావాల్సి వుందని గుర్తు చేసిన ఏపీ ప్రభుత్వం వాటిని చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించింది. బకాయిలు చెల్లించేంత వరకూ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి వుంది.

ఏడాదికి రూ.1,128 కోట్ల చొప్పున ఇప్పటిదాకా రూ, 4,449 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అందులో 1390 కోట్లు ఏపీనే తెలంగాణకు చెల్లించాల్సి ఉండటంతో దానిని మాఫీ చేసి మిగతా 3138 కోట్లను చెల్లించాలని కోరింది. భారీ మొత్తంలో బిల్లులు పేరుకు పోవడంతో రోజువారీ ఆర్థిక కార్యకలాపాలను సైతం నిర్వహించడం కష్టంగా మారుతోందని జెన్‌కో చెబుతోంది. దక్షిణాది రాష్ట్రాల లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ సహా కేంద్రం కూడా ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతోనే కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది.


చంద్రబాబుపై పెద్దపల్లిలో కంప్లైంట్...

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని బ్లాక్ డే గా అభివర్ణించిన చంద్రబాబుపై కేసు నమోదు చేయాలంటూ ఫిర్యాదు అందింది. టీఎస్ ముస్లిం పొలిటికల్ జేఏసీ, కేటీఆర్ యువసేన ఆధ్వర్యంలోని బృందం పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మను కలిశారు. అమరవీరులను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొనగా, న్యాయనిపుణులతో చర్చించి కేసు నమోదు చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  Telangana  Power Supply  Electricity Dues  

Other Articles