tension prevailed in prakasham as Tdp groups clashed మంత్రుల సాక్షిగా తెలుగుతమ్ముళ్ల బాహాబాహి..

Tension prevailed in prakasham as tdp groups clashed

clashes in prakasham tdp president election, karanam balaram and gottopati ravikumar, clashes betweem karanam and gottopati groups, tdp group clashes, karanam balaram, gottipati ravikumar, tension, party president election, clashes, addanki, Prakasam, tdp, ongole

Tension prevailed again in Ongole as clashes occurred between Tdp groups in prakasham district tdp president elections, Police interfered as MLC Karanam Balaram and MLA Gottipati Ravikumar followers clashed and were sent out from meeting hall.

ITEMVIDEOS: మంత్రుల సాక్షిగా తెలుగుతమ్ముళ్ల బాహాబాహి.

Posted: 05/23/2017 12:34 PM IST
Tension prevailed in prakasham as tdp groups clashed

క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పార్టీలో ఇప్పుడు క్రమశిక్షణను వెతుక్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయా..? అంటే అవుననే సమాధానాలే కనబడుతున్నాయి. ఇన్నాళ్లు అధినేత చంద్రబాబు మాటను జవధాని తెలుగు తమ్ముళ్లు.. ఆయన పార్టీ నేతలందరూ కలసికట్టుగా పనిచేయాలని అదేశాలను జారీ చేసినా.. పట్టించుకునే స్థితిలో లేరు. ఇందుకు తాజా ఉదాహరణ ఇవాళ మంత్రుల సమక్షంలోనే జరిగిన తెలుగు తమ్ముళ్ల ఘర్షణ. ప్రకాశం జిల్లా ఒంగోలులో తెలుగుదేశం పార్టీలో జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నికలో తెలుగు తమ్ముళ్లు ఏకంగా బాహాబహీకి దిగారు.

జిల్లాలో తమ వర్గానిదే పైచేయి వుండాలని భావించిన ఇరు వర్గాలు మంత్రుల సమక్షంలోనే ఘర్షణకు పాల్పడటంతో వారికి దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడి ఎన్నిక కోసం మాజీ మంత్రి కరణం బలరాం వర్గం, గోట్టిపాటి రవి వర్గం తమ వర్గం వారినే అధ్యక్షుడిగా చేయాలని భావించారు. ఈ క్రమంలో ఇవాళ మంత్రులు పరిటాల సునిత, నారాయణ, శిద్దా రాఘవులు సమక్షంలో ఒంగోలులో ఏర్పాటు చేసిన పార్టీ నేతల సమావేశంలో ఈ ఎన్నిక జరగాల్సివుంది.

అయితే రెండు వర్గాలు సమావేశానికి చేరుకోవడంతోనే గొడవకు దారి తీసింది. గొట్టిపాటి వర్గీయులతో కరణం బలరాం వర్గీయులు తలపడ్డారు. దీంతో తక్షణం స్పందించిన పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేసి పరిస్థినితి అదుపులోకి తీసుకోచ్చేలోపు కరణం బలరాం తనయుడు.. గోట్టిపాటి రవికుమార్ వర్గీయులకు మధ్య ఘర్షణ జరిగింది. బలరాం తనయుడు.. రవి వర్గం నేతలను నెట్టివేశాడు. గొట్టిపాటి వర్గీయులను బయటికి పంపించండీ అంటూ హుంకరించాడు. పరిస్థితిని అదుపులోకి తీసుకోచ్చేందుకు పోలీసులు వినతి మేరకు సమావేశ మందిరం నుంచి గోట్టిపాటి రవికుమార్ వర్గీయులు వెళ్లిపోయారు. దీంతో ఇవాళ అద్యక్ష ఎన్నిక వాయిదా పడింది.

కాగా ప్రశాంతంగా వున్న ప్రకాశం జిల్లాలో హత్యా రాజకీయాలు చేస్తూ అధిపత్యం కోసం పాకులాడుతున్నారని కరణం వర్గీయులు అరోపిస్తున్నారు. ఇటీవల కరణం వర్గీయుల జంటహత్యలు జరిగిన నాటి నుంచి అద్దంకీ నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. గొట్టిపాటి వర్గీయులే తమ వర్గం నేతలను హత్యచేయించారని ఇప్పటికే కరణం బలరాం అరోపించారు. కాగా ఈ హత్యలతో తమకేం సబంధం లేదని గొట్టిపాటీ రవికుమార్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ నుంచి ఏడాది క్రితం టీడీపీలో చేరిన గోట్టిపాటిని అది నుంచి కరణం వర్గీయులు వ్యతిరేకిస్తునే వున్న విషయం తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karanam balaram  gottipati ravikumar  tension  party president election  clashes  addanki  Prakasam  tdp  ongole  

Other Articles