Maoist Top Leader fire on KCR Over Farmers Arrest

Red mark on kcr govenment

Telangana Maoist, Maoist Leader Azad, KCR Maoist, KCR Maoist Leader, KCR Manifesto Maoist Group, KCR Farmers Arrest, Maoists Farmer Arrest, Maoist Leader Fire KCR

Maoist Leader Azad Fires on CM KCR in a open letter Over cases on farmers and arrest. Even Manifesto also not implemented by him Azad added.

కేసీఆర్ సర్కార్ పై రెడ్ మార్క్

Posted: 05/22/2017 10:41 AM IST
Red mark on kcr govenment

తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న జరుగుతున్న సమయంలో అప్పటి ఉద్యమ నేతగా మావోయిస్టుల ఎంజెడాకు తగ్గట్టుగానే పాలన కొనసాగిస్తానంటూ ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు పదులసార్లు నొక్కి చెప్పటం చూశాం. ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతేందుకు ఈ మూడేళ్లలో కూడా మావో వ్యతిరేక విధానాలు ఎక్కడా అవలంభించిన దాఖలాలు అయితే కనిపించలేదు కూడా. అయితే ఓవైపు రైతులకు రుణమాఫీలంటూ ప్రకటనలు కురిపిస్తూనే, వారిపై కేసులు బనాయించటం అన్నలకు ఆగ్రహాం తెప్పిస్తోంది.

మొన్నామధ్య ఖమ్మంలో రైతుదీక్ష సందర్భంగా రైతుల చేతులకు సంకెళ్లు వేసి తీసుకెళ్లిన ఉదంతం తెలిసిందే.అందుకు బాధ్యులైన అధికారులను సస్పెన్ చేసి చర్యలు తీసుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పార్టీల కతీతంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరోపక్క మావో నేతలు కూడా దీనిపై నిప్పులు కురించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన సీఎం కేసీఆర్ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని, నిజాంను తలదన్నే రీతిలో నియంతృత్వాన్ని కొనసాగిస్తున్నారని మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ ఓ లేఖలో విమర్శలు చేశాడు.

తెలంగాణ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు మిలిటెంట్ పోరాటాలు సాగించాలని పిలుపు నిచ్చాడు. ఒకేసారి రుణమాఫీ అని చెప్పి దఫదఫాలుగా చేస్తోందని, అందులోనూ స్పష్టత, పరిపూర్ణత లేకపోవటంతో గత్యంతరం లేని పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపాడు. రైతుల ఆత్మహత్యలను ఆపలేని ప్రభుత్వం, ఇతర కారణాలు చూపుతూ వారి చావులకు వాళ్లే బాధ్యులు అంటూ కొందరు నేతలు వ్యాఖ్యలు చేయటం దారుణమన్నాడు.గిట్టుబాటు ధర ఇప్పించాలని ఆందోళన చేసిన రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, వారిపై పెట్టిన కండీషన్డ్ బెయిల్ ను రద్దు చేయాలని ఆ లేఖలో డిమాండ్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telnagana  CM KCR  Farmers Arrest  Maoists  

Other Articles