Kapil Mishra Challenges Kejriwal to Electoral Contest

Kapil mishra challenges guru krejiwal

Sacked AAP Minister, AAP Kapil Mishra, Kapil Mishra Guru, Kapil Mishra Challenges, Kapil Mishra Kejriwal Bribe, AAP Crisis, Kejriwal Bribe Bomb, Satyendar Jain Kejriwal, Satyendar Jain Kapil Mishra, AAP Destroy, AAP BJP Politics

Sacked AAP Minister Kapil Mishra To Arvind Kejriwal 'Bless Me, Filing FIR Against You': Kejriwal breaks silence on Kapil Mishra's allegations: Truth will win.

కేజ్రీవాల్ పై దండయాత్ర ఓ రేంజ్ లోనే ...

Posted: 05/09/2017 10:31 AM IST
Kapil mishra challenges guru krejiwal

ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై వార్ ప్రకటించాడు. తన మాజీ గురు పైనే పోలీస్ కేసు పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. అవినీతికి పాల్పడ్డ కేజ్రీవాల్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేసిన కపిల్.. దమ్ముంటే ఎన్నికలకు రావాలంటూ బహిరంగ సవాలు విసిరాడు

తనకు కేజ్రీవాల్ నియోజకవర్గమైనా, తన నియోజకవర్గమైన ఒకటేనని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ కు వందిమాగధులు, ప్రత్యేక టీమ్ ఉన్నాయని, తనపై పోటీకి వారందరి సహాయ సహకారాలు తీసుకోవచ్చని ఆయన సూచించారు. తాను ఒంటరి వాడినని, ఒంటరిగానే పోరాడుతానని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ నుంచి తాను పోరాటాన్ని నేర్చుకున్నానని ఆయన తెలిపారు. ఈ బహిరంగ లేఖ కూడా ఆయన ఆశీర్వాదం కోసమే రాశానని ఆయన చెప్పారు. కేజ్రీవాల్ పై పోరాటంలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆయన తెలిపారు. అందుకే కేజ్రీవాల్ తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

ఈ రోజే కేజ్రీవాల్ మీద కేసు పెడుతున్నానని ఆయన చెప్పారు. పార్టీ మీటింగ్ లో కేజ్రీవాల్ తన అనుచరులతో తిట్టిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఎవరేంటో తెలుసుకోవాలంటే కేజ్రీవాల్ ప్రజా కోర్టులో తేల్చుకోవాలని, అలా తేల్చుకోవాలంటే...పదవికి రాజీనామా చేసి, తనపై పోటీ చేసి, గెలవాలని ఆయన సవాలు చేశారు. 400 కోట్ల స్కాంలో క్రేజీ వాల్ హస్తం ఉందంటూ ఈ బహిష్కృత మంత్రి సాక్ష్యాలతో సహా ఆరోపించటంతో కపిల్ ను పార్టీ నుంచి వెలివేశారు.

అయితే గత సాయంత్రం తనపై వస్తున్న ఆరోపణలపై కేజ్రీవాల్ ట్విట్టర్ లో స్పందించాడు. సత్యమే గెలుస్తుంది... ఒక్క రోజు అసెంబ్లీ సమావేశంలో అసలు విషయాలు వెలుగు చూస్తాయంటూ ట్వీట్ చేశాడు. ఆయన సతీమణి ఏకంగా తన మరిది(కపిల్ మిశ్రాను ఉద్దేశించి) ఇక లేడంటూ ట్వీట్ చేయటం విశేషం.

అన్నివైపులా దండయాత్ర...

తన కళ్ల ముందే సత్యేంద్ర జైన్ నుంచి రూ. 2 కోట్లు లంచాన్ని కేజ్రీవాల్ తీసుకున్నారంటూ ఆప్ నేత, మంత్రి కపిల్ మిశ్రా తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా మరో అవినీతి ఆరోపణను తెరపైకి తెచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీ నుంచి కేజ్రీవాల్ రూ. 2 కోట్లు లంచం తీసుకున్నారంటూ స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు లేఖ రాశారు. కేజ్రీవాల్ పాల్పడిన ఈ అవినీతిపై వెంటనే విచారణ చేపట్టాలని లేఖలో కోరారు. రూ. 50 లక్షల చెప్పున నాలుగు దఫాలుగా కేజ్రీవాల్ నగదును పుచ్చుకున్నారని... క్విడ్ ప్రోకోలో భాగంగానే ఈ అవినీతి జరిగిందని పేర్కొన్నారు. కేజ్రీవాల్ పై తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయని కూడా స్వామి తెలిపాడు.

మరో బహిష్కృత ఎమ్మెల్యే ఆసిమ్‌ అహ్మద్‌ ఖాన్‌ కూడా కేజ్రీవాల్ పై ఆరోపణలు చేశాడు. ఆయన అనుచరులు తనను రూ. 5 కోట్లు డిమాండ్‌ చేశారని వెల్లడించారు. పార్టీని ప్రైవేటు కంపెనీలా మార్చేశారని ధ్వజమెత్తారు. పార్టీ అవినీతికి కపిల్‌ మిశ్రాను బలిపశువు చేశారని వాపోయారు. కేజ్రీవాల్‌ను వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Kapil Mishra  Aravind Kejriwal  Challenges  

Other Articles