Janasena Entrance Test Second Phase Details

Pawan kalyan concentrate on telangana politics

Janasena Entrance Test, Pawan Kalyan Uttarandhra Janasena Test, Janasena Second Phase Test, Janasena Second Entrance Notification, Pawan kalyan Janasena Telangana, Telangana Janasena Expansion, Janasena Entrance Not Competitive Exam, Janasena Greater Hyderabad Entrance Exam, Janasena Second Exam

Janasena Second Phase Entrance Test Notification Released. Uttarandhra and Greater Hyderabad this time. Pawan Kalyan Says It is not Competitive Exam.

పవన్ కాంసంట్రేషన్ మారిపోయిందిగా...

Posted: 05/06/2017 11:32 AM IST
Pawan kalyan concentrate on telangana politics

మొన్నటి దాకా వరుస సభలు, హోదా పై పోరు, ట్విట్టర్ లో వరుస ట్వీట్లు ఇలా కేవలం ఏపీ రాజకీయాలపైనే దృష్టిసారించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరో తెలుగు రాష్ట్రంపై పై శ్రద్ధ తీసుకోవటం ప్రారంభించేశాడు. ఉస్మానియా యూనివర్సిటీకి శత జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు.. నిన్న మిర్చి కొనుగోలులో రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష అంటూ ప్రశ్నలు గుప్పించి తెలంగాణకు మద్ధతుగా చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం.

ఇదిలా ఉంటే పార్టీ విస్తరణలో భాగంగా ఇక్కడ కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. అనంతపురం తర్వాత జనసేన పార్టీ తరపున నిర్వహించబోయే ఎంట్రన్స్ టెస్ట్ ల కోసం వేదికలను ఖరారు చేసేశాడు. ఉత్తరాంధ్ర(విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో)తోపాటు గ్రేటర్ హైదరాబాద్ లో ఒకేసారి పరీక్ష నిర్వహించేందుకు సిద్ధమౌతోంది జనసేన. దరఖాస్తులను ఆన్ లైన్ లో కూడా పంపొచ్చని, ఈ నెల 13 అర్థరాత్రి దాకా అందుకు గడువు ఉందని ఓ ప్రకటనలో పవన్ పేర్కొన్నాడు.

ఇక దీనిని పోటీ పరీక్షగా ఎగ్జామ్ గా భావించొద్దన్న పవన్, కేవలం ప్రతిభ, అవగాహన, పరిజ్నానం ఆధారంగానే కార్యకర్తల ఎంపిక ఉంటుందని ఆ ప్రకటనలో వెల్లడించాడు. రాజకీయ ప్రక్రియలో నవతరాన్ని ఆహ్వానించాలన్న ఆలోచనతో తామీ కార్యాచరణకు పూనుకున్నట్లు స్పష్టం చేశాడు. అయితే అనంతపురంలో నిర్వహించిన మొదటి టెస్ట్ ఫలితాలు వెలువడకముందే ఇలా రెండో నోటిఫికేషన్ వెలువటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Janasena  Entrance Test  

Other Articles