Uber customer charged Rs 5,325 in Bangalore

Uber charges bomb to mysuru techie

Uber charge, Uber Cab, Uber App Mistake, Mysuru Techie Uber, Uber Charged 5325 Rupees, 6 KM Ride Uber, Uber Bangalore Techie, Uber Technical Issue, Uber Mistake Charge, Uber Charged Bomb, Uber Terrific Experience, Uber Police Station, Uber Customer Police Station, Uber Customer Care Neglect

Uber charges Mysuru techie Rs 5325 for a 6-km trip. with a glitch in Uber's app, turned into a heated argument between the rider and the driver and ended in a trip to the police station.

ఉబెర్ దెబ్బకు పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు

Posted: 05/06/2017 07:39 AM IST
Uber charges bomb to mysuru techie

టెక్నాలజీ యుగంలో ఎంత అభివృద్ధి జరిగినా, ఇంకా జరుగుతున్నా తప్పిదాలు అనేవి సర్వసాధారణంగా మారిపోయాయి. ముఖ్యంగా టైం లేక యాప్ ల మీద పడిపోతున్న వారికి షాకింగ్ అనుభవాలనే మిగులుస్తున్నాయి. మొన్నామధ్య ఓలా సంస్థ ఓ ప్రయాణికుడికి ఊహించని రీతిలో ఛార్జీ వేసి వణికించగా, ఇప్పుడు ఉబెర్ వంతు వచ్చింది.

బెంగళూరు రైల్వేస్టేషన్‌ లో దిగిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ‌మైసూరు రోడ్డులోని శాటిలైట్ బస్టాప్ దగ్గర్లో ఉన్న తన ఇంటికి వెళ్లేందుకు ఉబర్‌ క్యాబ్‌ ను బుక్‌ చేసుకున్నాడు. ఆ రెండింటికి మధ్య దూరం కేవలం ఐదు కిలో మీటర్ల దూరం. క్యాబ్ వచ్చాక ఎంచాక ఎక్కి కూర్చున్న అతను తన గమ్యస్థానం రావటంతో దిగిపోయాడు. అప్పుడు క్యాబ్ డ్రైవర్ 5,325 రూపాయల బిల్లు అతని చేతిలో పెట్టడంతో ఒక్కసారిగా నోరు తెరిచాడు.

తాను గతంలో ఈ రూట్ లో చాలా సార్లు ప్రయాణించానని చెప్పుకొచ్చాడు. అయితే ఇది గతంలో చేసిన జర్నీలకు సంబంధించిన బిల్లు అని చెప్పటంతో ఆ ప్రయాణికుడు అవాక్కయ్యాడు. తాను కేవలం రెండు సార్లు మాత్రమే ప్రయాణించానని ఆ మాత్రంకే అంత బిల్లు వేస్తారా? అంటూ మండిపడ్డాడు. డ్రైవర్ చెల్లించాల్సిందేనని పట్టుబట్టడంతో మాటా మాటా పెరిగి విషయం పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది. ఈ లోపు కస్టమర్ కేర్ కు కాల్ చేయగా, తమకు ఏం తెలీదని వ్యవహారం స్టేషన్ లోనే తేల్చుకోండని చెప్పటం కొసమెరుపు. బైతనాపుర స్టేషన్ కి చేరుకోగా అక్కడ కేవలం 103 వసూలు చేయించి, డ్రైవర్ కి సర్దిచెప్పి.. ప్రయాణికుడిని పంపిచేశారు.

ఈ విషయమై ఉబర్ ను సంప్రదించగా సాంకేతిక లోపం కారణంగా ఈ తప్పిదం చోటుచేసుకుందని, దీనికి చింతిస్తున్నామని తెలిపింది. ఏదైనా ఇలా ప్రయాణికులను క్యాబ్ సంస్థలు బెంబేలెత్తిస్తున్న ఘటనలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి.

 

కాన్సిల్ రైడ్ తో చుక్కలు చూశాడు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uber  Bangalore Techie  5325 Rupees  

Other Articles