Andhra Pradesh Stands Second in Corruption

Ap secured second place in corruption

Andhra Pradesh Corruption, Andhra Pradesh Second Place, Chandrababu Naidu Government Corruption, Centre for Media Studies Survey, Andhra Pradesh bribe, Corruption In India, Most Corrupted State in India, Corruption Survey India, TDP Corruption Ruling, Chandrababu Naidu Corruption

Andhra Pradesh second Corrupted state in India follows Karnataka. Corruption Decreases By 60% In India Corruption Decreases By 60% In India;Centre for Media Studies reported.

ఆంధ్రప్రదేశ్ కు అరుదైన ఘనత

Posted: 04/29/2017 11:24 AM IST
Ap secured second place in corruption

నవ్యాంధ్రకు దేశంలో 2వ స్థానం దక్కింది. అభివృద్ధి విషయంలో కాదు, అవినీతి పెరిగిపోవటంలో ఈ ఘనత సాధించింది. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ (సీఎంఎస్) తాజాగా నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. ఏపీతోపాటు మరో ఐదు రాష్ట్రాల్లో ఇది విపరీతంగా పెరిగిపోయిందని ఓ సర్వే వెల్లడించింది. సగటున 10 రూపాయిల నుంచి అతి ఎక్కువగా 50 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు వెల్లడించింది.

గత 12 ఏళ్లలో ఏయే రంగాల్లో అవినీతి - లంచాలు పెరిగిపోయాయో విశ్లేషించేందుకు సీఎంఎస్ 20 రాష్ర్టాల్లో సర్వే నిర్వహించింది. గత ఏడాది కాలంలో ఎక్కవ అవినీతి జరిగిన రాష్ట్రంగా కర్ణాటక (77 శాతం) మొదటి స్థానంలో నిలువగా ఆంధ్రప్రదేశ్ 74 శాతంతో రెండవ స్థానంలో ఉంది. చివరిసారిగా సర్వే జాబితాలో కూడా ఏపీకి రెండో స్థానమే దక్కటం విశేషం.

ఏపీ విషయానికొస్తే 2017 సర్వేలో గత ఏడాది ప్రభుత్వ సర్వీసుల్లో అవినీతి పెరిగినట్లు 43 శాతం మంది పేర్కొన్నారు. 2005నాటి సర్వేలో ఇది 73 శాతంగా ఉంది. కర్ణాటక, ఏపీ తర్వాత తమిళనాడు (68 శాతం), మహారాష్ట్ర (57 శాతం), జమ్ము కశ్మీర్ (44 శాతం), పంజాబ్ (42 శాతం) లు నిలిచాయి. అతి తక్కువ అవినీతి జరిగిన రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ (3 శాతం) నిలిచింది. సర్వేలో వెల్లడైన వివరాల ప్రకారం... మూడింట ఒక వంతు ప్రజలు సంవత్సరం మొత్తంలో ఏదో ఒక సందర్భంలో అవినీతి సమస్యకు గురైనట్లు వెల్లడించింది.

అయితే ఓవరాల్ గా మాత్రం దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో - ప్రభుత్వ - ప్రజా సేవల్లో అవినీతి తగ్గుముఖం పట్టినట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 2005 సంవత్సరంలో 20500 కోట్ల మేరకు అవినీతి జరిగినట్లు అంచనా వేయగా 2017లో అది 6350 కోట్ల రూపాయిలకు తగ్గిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Centre for Media Studies  Corrupt States  Andhra Pradesh  

Other Articles