Dinakaran brought to Chennai for EC Bribe Case investigation

Dinakaran taken to chennai for further investigations

TVV Dinakaran, Dinakaran, Dinakaran Delhi Police, EC Bribe Case, EC Bribe Dinakaran, Dinakaran Case, Dinakaran Ministers, AIADMK Minsters EC Bribe, Tamil Nadu Ministers Arrest, Dinakaran Threat Ministers, Election Commission Dinakaran, Dinakaran House Investigation

TVV Dinakaran, Aide Brought To Chennai By Delhi Police to close investigation.State ministers also may arrest soon.

దినకరన్ దెబ్బకు వాళ్లు కూడా అవుట్?

Posted: 04/29/2017 08:45 AM IST
Dinakaran taken to chennai for further investigations

శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ వ్యవహారం ఢిల్లీ నుంచి తిరిగి తమిళనాడుకు చేరిన విషయం తెలిసిందే. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులను పావులుగా వాడుకుంటూ బీజేపీ యే తమిళ రాజకీయాలతో ఆటాడుకుంటోందని డీఎంకే సహా అన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇక ఢిల్లీ నుంచి క్రైం బ్రాంచ్ పోలీసులు చెన్నైకి తరలించి అక్కడే దినకరన్ ను విచారిస్తున్నారు. ఈసీకి లంచంగా ఇవ్వాలనుకున్న 50 కోట్ల సొమ్మును తన స్నేహితుడు మల్లికార్జున్ ద్వారా ఏజెంట్లకు పంపిణీ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

అలాగే మాజీ ఐఏఎస్ మోహన్ రంగం ఇంటికి వెళ్లి గంటలకు పైగా విచారణ జరిపారు. నగరంలో ఉండే మరో సీనియర్ ఐఏఎస్‌ను కూడా రహస్యంగా విచారించారు. శుక్రవారం ఢిల్లీ పోలీసులు నరేశ్ అనే హవాలా ఏజెంట్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ద్వారానే దినకరన్ బ్రోకర్ సుఖేశ్ చంద్రకు రూ.10 కోట్లు పంపి ఎన్నికల అధికారులతో బేరసారాలు సాగించినట్టు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. అమ్మ వర్గం రెండుగా చీలాక దినకరన్ కు మద్ధతు ఇచ్చిన కొందరు మంత్రులు ఆర్కే నగర్ బరిలో నిలిపేందుకు డబ్బులు పెట్టడం వెలుగు చూసింది.

ఐదుగురు మంత్రులతోపాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తలా ఓ చెయ్యి వేసినట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారించుకున్నారు. వీరిని క్లోజ్ గా ఉండి విచారణ జరిపేందుకు దినకరన్ ను చెన్నై కి తరలించినట్లు అర్థమౌతుంది. పార్టీ రెండాకుల గుర్తును నిలపుకునేందుకు శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్ ఏకంగా ఎన్నికల సంఘం అధికారులకే లంచం ఇవ్వజూపాడు. అడ్డంగా బుక్కయి ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల చేతిలో బంధీగా ఉన్నాడు. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నట్టు పేర్కొన్నారు.

మొత్తానికి దినకరన్ కేసులో మంత్రుల చుట్టూ ఉచ్చు బిగుస్తుండటంతో వారిని సాధ్యమైనంత దూరం పెట్టి తన చేతికి మట్టి అంటకుండా చూసుకోవాలని సీఎం పళనీస్వామి నిర్ణయించుకున్నాడు. ఒకవేళ అరెస్ట్ దాకా పరిస్థితి వెళితే మాత్రం వారిని తొలగించేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాడంట. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TVV Dinakaran  EC Bribe Case  Delhi Police  Chennai  

Other Articles