groom irked with food, bride marries guest పెళ్లిలో గొడవ.. అతిధిని పరిణయమాడిని వధువు..

Bride marries guest after groom irked with lack of non veg food

up bride marries guest, bride marries guest, bride marries another man, groom irks with food, groom irks with non veg food, guest marries bride, Love shuv chicken khurana, bride, brideroom, non veg food, guest, Kulhedi village, Yogi Adityanath, Uttar pradesh government

The ban on illegal slaughterhouses across Uttar Pradesh took a toll on a wedding as a man in the district refused to solemnise his marriage after seeing that only pure vegetarian dishes were served.

పెళ్లిలో గొడవ.. అతిధిని పరిణయమాడిని వధువు..

Posted: 04/28/2017 12:51 PM IST
Bride marries guest after groom irked with lack of non veg food

మ్యారేజస్ అర్ మేడ్ ఇన్ హెవెన్ అన్న పెద్దల మాట.. అక్షరాల నిజమని తెలియజేస్తుంది ఈ ఘటన. పెళ్లికి ముహార్తాలు పెట్టుకున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. చివరి నిమిషంలో కేవలం మాంసాహార బోజనం పెట్టలేదని వరుడి కుటింబికులు వదుపు కుటింభికులతో గొడవకు దిగడం.. రెండు కుటుంబాల మధ్య ఘనంగా జరగాల్సిన వేడుక కాస్తా. అరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు చివరకు ఘర్షణలకు దిగడంతో రణరంగాన్ని తలపించింది.

అదే సమయంలో కేవలం మాంసాహార బోజనం కోసం పెళ్లి వేడుకను యుధ్దభూమిలా మార్చిన వరుడి కుటుంబంతో తాను సంబంధం కలుపుకోబోనని, అసలు వరుడితో తనకు పెళ్లే వద్దని వదువు చేల్చిచెప్పింది. అది విన్న పెళ్లికి అతిధిలా వచ్చిన ఓ యువకుడు తనకు వదువు ధైర్యం నచ్చిందని, అమె అంగీకరిస్తే తాను అమెను వివాహమాడుతానని అక్కడికక్కేడే ప్రతిపాదన చేయడం.. అందుకు వధువు కూడా అంగీకారం చెప్పడంతో.. వధువుతో జరగాల్సిన పెళ్లి.. అతిధితో జరగింది.

ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని కుల్ హెడీ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... వివాహ వేడుకకు వచ్చిన బంధువులకు ముహూర్తం కన్నా ముందుగానే భోజనం పెట్టారు. ఈ భోజనంలో మాంసాహారం పెట్టలేదని వరుడి కుటుంబం వధువు కుటుంబంతో ఘర్షణకు దిగింది. సీఎం ఆదిత్యనాథ్ కబేళాలు రద్దు చేయడంతో మాంసం దొరకడం లేదని, అందుకే మాంసం కొరత ఏర్పడి వండలేదని వరుడి కుటుంబానికి వధువు కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చుకున్నారు.

అయినా వారు శాంతించకపోవడంతో తిక్కరేగిన వధువు... తిండి కోసం రభస చేసే అలాంటి కుటుంబంతో తనకు బంధం వద్దని తేల్చిచెప్పింది. ఈ తతంగం మొత్తాన్ని గమనించిన అతిథి... యువతి ధైర్యాన్ని మొచ్చిన యువకుడువధువు అంగీకరిస్తే తాను ఆమెను వివాహం చేసుకుంటానని ప్రతిపాదన చేయడం,, అందుకు వధువు సరేననడం.. వారిద్దరక వివాహం జరగడం అన్ని చకచక జరిగిపయాయి. దీంతో వరుడి కుటుంబం షాక్ తింది. ఘోర అవమానంతో వెనుదిరిగింది. ఈ పెళ్లి తాలుకు వార్త దవాణంలో వ్యాపించడంతో అది కాస్తా సోషల్ మీడియాలో ట్రెండింగ్ న్యూస్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles