TRS Pragati Nivedana Sabha in Warangal

Oruggalu goes the pink way

TRS Pragati Nivedana Sabha, Pragati Nivedana Sabha, TRS Warangal, Oruggalu Pink City, Warangal Pink City, KCR TRS Pragati Nivedana Sabha, Hyderabad RTC Warangal TRS Sabha, KCR Warangal Meeting

All set for TRS Pragati Nivedana Sabha in Warangal. Venue decked up for the event. Hyderabad people faces transportation problem.

వరంగల్ టీఆర్ఎస్ సభకు ఎన్ని కష్టాలో...

Posted: 04/27/2017 09:12 AM IST
Oruggalu goes the pink way

16వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం వరంగల్‌లో భారీ బహిరంగ సభ జరగనున్న విషయం తెలిసిందే. తన లక్కీ ప్లేస్ గా భావిస్తున్న ఓరుగల్లులో అతిపెద్ద మీటింగ్ నిర్వహించటం ద్వారా తన బలమేంటో నిరూపిస్తూ అందరి దృష్టి ఆకర్షించేందుకు కేసీఆర్ సిద్ధమైపోయాడు. గత డిసెంబరు 2న హైదరాబాద్‌లో జరగాల్సిన సభ ఇది. అయితే అనూహ్యంగా నవంబరులో కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం బహిరంగ సభ ఆలోచనను విరమించుకుంది.

హైదరాబాద్‌లో నిర్వహించాలనుకున్న సభ ఆగిపోవడంతో టీఆర్ఎస్ 16 వార్షికోత్సవ సభకు వరంగల్‌ను వేదికగా ఎంచుకుంది. ఈ సభకు 10 నుంచి 15 లక్షల మందిని తరలించాలని నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు 2015లో హైదరాబాద్‌లో, 2016లో ఖమ్మంలో పార్టీ వార్షికోత్సవాలు నిర్వహించారు. ఇప్పుడు వరంగల్‌లో నిర్వహిస్తున్నారు. అనుకున్నట్టుగా 10 లక్షలకు మించి జనాలు హాజరైతే టీఆర్ఎస్ చరిత్రలో ఇదే అతిపెద్ద భారీ బహిరంగ సభగా నిలిచిపోతుంది.

హైదరాబాద్ లో కష్టాలు...

వరంగల్‌లో నేడు జరగనున్న టీఆర్ఎస్ వార్షికోత్సవ సభ కోసం చేసిన ఏర్పాట్లతో హైదరాబాద్ లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆర్టీసీ బస్సులన్ని వరంగల్ వైపే క్యూ కట్టడంతో ఇక్కడ నగరంలో రవాణా సదుపాలయాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఆఫీసులకు వెళ్లే వారికి బస్సులు తక్కువగా ఉండటం, మరికొన్ని బస్సులు డిపోకే పరిమితమైపోవటం ఇబ్బందికరంగా మారింది.

ఇక ప్రత్యేకంగా 9 పార్కింగ్ జోన్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో వచ్చే వాహనదారులకు ఇబ్బంది లేకుండా నేరుగా ఈ పార్కింగ్ జోన్లకు చేరుకునేందుకు వీలుగా ఈ పార్కింగ్ జోన్లతో గూగుల్ మ్యాప్‌కు లింక్ చేశారు. ఇందుకు సంబంధించిన లింక్‌ను సభ నిర్వాహకులు ఇప్పటికే ఆయా జిల్లాల నేతలకు వాట్సాప్ ద్వారా పంపించారు. సభకు రావాలనుకున్నవారు ఈ లింక్ ద్వారా నేరుగా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Pragati Nivedana Sabha  Warangal  

Other Articles