Hyderabad New Traffic rules introduced | హైదరాబాద్ ట్రాఫిక్ టఫ్ రూల్స్.. ఇంకా మీరు బండి నడపలేరు

Hyderabad traffic new rules introduced

Hyderabad Traffic Rules, Hyderabad New Traffic Violation Rules, Telangana Traffic Rules, Points Penality Hyderabad Traffic, Hyderabad Traffic Violations, New Traffic Rules Hyderabad, Hyderabad Traffic License Cancell

Hyderabad New Traffic Violation Rules GO Passed. Points wise scale for violations in India first time. Drivers with licence also beware.

హైదరాబాద్ ట్రాఫిక్ కొత్త రూల్స్ ఇవిగో...

Posted: 04/25/2017 10:02 AM IST
Hyderabad traffic new rules introduced

తెలంగాణ సర్కార్ ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలకు సిద్ధమైంది. అడ్డగోలుగా వాహనాలను నడుపుతూ.. ప్రమాదాలకు కారకులవుతున్నవారిని, అమాయకుల ప్రాణాలు బలిగొంటున్న వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని రవాణా శాఖ నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా నగరంలో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ మోటారు వాహనాల నిబంధనలను సవరిస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇందుకోసం దేశం లోనే ఫస్ట్ టైం అతిక్రమణల కోసం పెనాల్టీ పాయింట్ల విధానాన్ని ప్రవేశపెట్టింది రవాణా శాఖ. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన ప్రతిసారీ వాహనదారుడి ఖాతాలో పాయింట్లు నమోదవుతుంటాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇంతకు ముందులా జరిమానాతో మాత్రమే సరిపెట్టరు. డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసేస్తారు. హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే ఒకటి, రాంగ్ రూట్‌లో వెళ్తే రెండు.. ఇలా ప్రతిసారీ కొన్ని పాయింట్లు ఇస్తారు.

ఇవి రెండేళ్ల కాలంలో 12 దాటితే వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను ఏడాది పాటు రద్దు చేస్తారు. ఆ తర్వాత కూడా అదే తీరు కొనసాగితే ఈసారి రెండేళ్లు రద్దు చేస్తారు. ఇలా ప్రతి ఏడాది రద్దు చేయటం పెరిగిపోతూనే ఉంటుంది. లెర్నింగ్ లైసెన్స్ విషయంలో కూడా కఠిన నిబంధనలను అమలు చేయనుంది. దాని చెల్లుబాటు సమయంలో గనుక 5 పెనాల్టీ పాయింట్లు వస్తే లైసెన్స్ రద్దయిపోతుంది. అంటే వాళ్లు మరోసారి లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. నేటి నుంచే నిబంధనలు అమలులోకి రానున్నాయి.

పాయింట్ల విషయానికొస్తే.. 

రాంగ్ రూట్ లో వెళ్లితే... 2 పాయింట్లు

హెల్మెట్, సీట్ బెల్ట్ లేకుండా డ్రైవ్ చేస్తే 1 పాయింట్

సిగ్నల్ జంపింగ్ కు 1 పాయింట్

మద్యం సేవించి బండి, కారు నడిపితే..  3 పాయింట్లు

మద్యం సేవించి ఆటో, క్యాబ్ నడిపితే 5 పాయింట్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Hyderabad Traffic  New Rules  Points Penality  

Other Articles