madhu yashki slams kcr family.. కేసీఆర్ కుటుంబంపై బాంబు పేల్చిన మాజీ ఎంపీ..!

Former mp madhu yashki slams kcr family on ed notices

madhu yashki goud slam kcr on ed notices, madhu yashki goud kcr ed notices, madhu yashki goud kcr, madhu yashki goud kavitha, madhu yashki goud ktr, madhu yashki goud kt ramarao, madhu yashki goud harish rao, kcr, telanagana cm, kavitha, kt rama rao, enforcement directorate, notices, trs, congress, politics

congress leader and former nizamabad parliamentarian madhu yashki goud slams kcr family on supporting demonetisation after ED serving notices.

కేసీఆర్ కుటుంబంపై బాంబు పేల్చిన మాజీ ఎంపీ..!

Posted: 04/22/2017 05:12 PM IST
Former mp madhu yashki slams kcr family on ed notices

హైదారబాద్ జీహెఛ్ఎంసీలో రోడ్ల మరమ్మతుల కోసం గ్రేటర్ హైదరాబాద్ విడుదల చేసిన సుమారు 300 కోట్ల రూపాయల నిధులను ఎలాంటి పనులు చేయకుండా అప్పనంగా స్వాహా చేశారని, ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ కమీషనర్ అంతర్గత విచారణకు సైతం అదేశించారని చెప్పి అధికార పార్టీలో కలకలం రేపిన కాంగ్రెస్ సీనియర్ నేత, నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ గౌడ్.. మరో సారి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అంతకుమించిన అరోపణలు చేశారు.

అయితే ఆ ఆరోపణలు కొట్టిపారేసిన టీఆర్ఎస్ పార్టీ వర్గాలు జీహెచ్ఎంసీలో నిధులు విడుదల చేయాలని సంకల్పించామని, అయితే రోడ్లు మరీ అద్వాన్నంగా వున్న ప్రాంతాలను ఎంచుకుని వాటిని వరుస క్రమంలో మరమ్మతులు చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. మొత్తానికి హైదరాబాద్ రోడ్లన్నీ మరమ్మతులు తరువాత కొత్త కళను సంతరించుకున్నాయి. అయితే తాజాగా మధుయాష్కీ చేసిన అరోపణలు మాత్రం ఏకంగా అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని చెప్పుకుంటున్న అధికార పార్టీ పరువు ప్రతీష్టలను దెబ్బతీసేలా వున్నాయి.

పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానిది దిక్కుమాలిన నిర్ణయం అని గతేడాది నవంబర్ 16న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించిన నేపథ్యంలో ఆయనపైకి కేంద్రం అస్త్రాలను సంధించిందని.. దీంతోనూ ఆయస గత్యంతరం లేని పరిస్థితుల్లో కేంద్ర నిర్ణయానికి మద్దతు పలికారని మధుయాష్కీ అరోపించారు. అయితే ఏమిటా అస్త్రం అని అడుగుతున్నారా..? ఇక్కడి నుంచి నిధులను అక్రమంగా విదేశాలకు మళ్లించి.. మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అరోపించారు. రాష్ట్రంలో అవినీతి రహిత పాలన జరుగుతున్న క్రమంలో నిధులు మళ్లింపు ఎలా జరుగిందన్నది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ సహా తన కుటుంబ సభ్యులకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసులు ఇచ్చిందని మధుయాష్కి ఆరోపించారు. కేసీఆర్ కుమారుడు కే తారక రమారావు, కుమార్తె కవిత, అల్లుడు హరీష్ రావులకు ఈడీ నోటీసులు ఇచ్చిన మాట వాస్తవం కాదా..?అని ఆయన ప్రశ్నించారు. ఈడీ నోటీసులు ఇచ్చినట్టు తన వద్ద సమాచారం ఉందని తేల్చిచెప్పారు. ఈ నోటీసుల ప్రభావానికి లొంగిపోయిన కేసీఆర్ కేంద్రం పెద్దనోట్ల రద్దుకు మద్ధతిచ్చారని మధుయాష్కి పేర్కొన్నారు. ఇది నిజమో కాదో సీఎం కేసీఆర్‌ స్పష్టం చేయాలన్నారు. అలాగే జీహెచ్ఎంసీ రోడ్ల పనుల్లో అవినీతిపై చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : madhu yashki goud  kcr  telanagana cm  kavitha  kt rama rao  enforcement directorate  notices  trs  congress  politics  

Other Articles