బీజేపీ కురువృద్ధుడికి బిగ్ షాక్.. బాబ్రీ కూల్చివేత పెద్ద కుట్రే | LK Advani To Be Tried For Criminal Conspiracy In Babri Case.

Advani criminal conspiracy confirmed by supreme court

Babri Masjid Demolition, LK Advani Babri Issue, Supreme Court LK Advani, Supreme Court Babri Masjid Demolition, Advani Murali Manohar Joshi Uma Bharathi, BJP Senior Leaders Babri Row, Babri Demolition, CBI LK Advani, CBI Babri Re InVestigation, Lucknow Trial Court LK Advani

LK Advani, Murli Manohar Joshi, Uma Bharti and other BJP leaders to face conspiracy charges in Babri Masjid demolition, pronounces Supreme Court

బీజేపీ కురువృద్ధుడికి బిగ్ షాక్

Posted: 04/19/2017 10:58 AM IST
Advani criminal conspiracy confirmed by supreme court

బీజేపీ కురువృద్ధుడు, మాజీ కేంద్ర మంత్రి లాల్ కృష్ణ అద్వానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్వానీ సహా మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి లను కుట్రదారులుగా తేలుస్తూ సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. కేసుల పునరుద్ధరకు ఆదేశాలు జారీ చేసింది. లక్నో ట్రయల్ కోర్టులో విచారణను కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది.

విచారణను ఆపేయాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం రెండేళ్లలో విచారణను పూర్తి చేయాలని ఆదేశించింది.

1992 డిసెంబర్‌ 6న బాబ్రీ మసీదును కరసేవకులు వీళ్ల సమక్షంలోనే కూల్చివేశారు. అద్వానీ, ఉమాభారతి, జోషి, కళ్యాణ్ సింగ్ సహా మొత్తం 22 మంది నేతలు గుర్తు తెలియని కరసేవకులను ప్రోత్సహించారని కేసు నమోదయింది. ఈ కుట్ర కేసును అలహాబాద్, లక్నో కోర్టులు గతంలో కొట్టి వేశాయి. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. బుధవారం సుప్రీం కోర్టు అలహాబాద్ కోర్టు తీర్పను తప్పుబట్టింది. కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది. కాగా, మరో సీనియర్ నేత, ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్ గా ఉన్న కళ్యాణ్ సింగ్‌పై కేసులో మినహాయింపు ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : LK Advani  Babri Masjid Demolition  Supreme Court  

Other Articles