చేనేత బ్రాండ్ అంబాసిడర్.. సమంతకు అసలు అంత సీన్ లేదంట | Samantha not a face of Telangana handlooms.

Samantha not brand ambassador for telangana hand looms

Telangana handlooms, Samantha Not Brand Ambassador, Telangana Hand-looms and Textiles Ministry, Samantha Telangana, Samantha No Face of Telangana Hand looms, Samantha KTR

Telangana handlooms and textiles ministry clarity on Samantha Controversy. Samantha not brand ambassador for Telangana Hand loom said to a RTI enquiry.

సమంతకు కేసీఆర్ సర్కార్ షాక్

Posted: 04/19/2017 09:43 AM IST
Samantha not brand ambassador for telangana hand looms

తెలంగాణలో చేనేత వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించే దిశగా అడుగులు వేసిన ఐటీ మంత్రి కేటీఆర్ స్టార్ హీరోయిన్ సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రమోట్ చేసేందుకు ఆమె మద్ధతు ఇవ్వటంతో థాంక్స్ చెప్పిన కేటీఆర్, ఆమెను కలిసి చీరలు కూడా బహుకరించాడు. ఆపై ఏకంగా రంగంలోకి దిగిన సమంత ఆయా ఊర్లలో పర్యటనలు కూడా చేసేసింది. దుబ్బాక, భూదాన్ పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్క్ లను సందర్శించి అక్కడ కార్మికులతో ముచ్చటించింది కూడా.

అంత సవ్యంగా జరుగుతుందనుకున్న క్రమంలో ఓ తెలుగమ్మాయి కానీ సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించటమేంటని రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్ష కాంగ్రెస్ సహా కేటీఆర్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా వాటన్నింటిని లైట్ తీస్కున్నారు. చివరకు సమాచార హక్కు చట్టం కింద ఈ అంశంపై అడిగిన ప్రశ్నలో విస్తూ పోయే విషయం ఒకటి బయటపడింది. అసలు సమంత బ్రాండ్ అంబాసిడర్ కానే కాదని...

Telangana Government shock to Samantha

అవును... చేనేత వర్గాల చైతన్య అధ్యక్షుడు చిక్కా దేవదాసు ఆర్టీఐ కింద ఈ వ్యవహారం పై వివరణ కోరగా, చేనేత, జౌళి మంత్రిత్వ శాఖ నుంచి ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం వచ్చింది. తెలంగాణలో చేనేత దుస్తులకు మరింత ప్రాచుర్యం కల్పించాలన్న భావనలో ఉన్న ప్రభుత్వం, హీరోయిన్ సమంతను చేనేత రాయబారిగా(బ్రాండ్ అంబాసిడర్) గా నియమించినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని తెలంగాణ ప్రభుత్వం తేల్చింది. అయితే ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో సమంతను చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసినట్టు స్వయంగా కేటీఆర్ ప్రకటించటం ఇక్కడ కొసమెరుపు.

 

సమంతకు కేటీఆర్ స్పెషల్ థాంక్స్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Actress Samantha  Telangana Hand looms  Not Ambassador  

Other Articles