మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. ఎస్బీఐ తాజా నిర్ణయం 'No Minimum Balance Required for Savings Account'

Sbi announces no minimum balance required for savings account

State bank of India, no minimum balance, pm jan dhan yogana, basic savings accounts, sbi twitter, twitter, arundathi bhattacharya, pm modi, demonetisation

SBI allows the users without basic savings – there will not be any minimum monthly balance is required. Valid Know You Documents (KYC) is just needed to open the bank account.

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేదు.. ఎస్బీఐ తాజా నిర్ణయం

Posted: 04/15/2017 10:48 AM IST
Sbi announces no minimum balance required for savings account

స్టేట్ బ్యాంక్ అప్ ఇండియా తమ ఖాతాదారులకు శుభవార్తను అందించింది. ఖాతాదారులు తమ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచుకోవాలని.. లేకపోతే ఛార్జీల మోత మోగిస్తామని వారిని తీవ్ర అందోళనకు గురిచేసిన ఎస్బీఐ తాజాగా కొంత ఊరటను కలిగించే నిర్ణయం తీసుకుని శుభవార్తను అందించింది. ఏప్రిల్ 1 నుంచి మినిమమ్ బాలెన్స్ లేని ఖాతాలదారులపై బాదులు మొదలైడతామని చెప్పిన నేపథ్యంలో  ఏ బ్యాంకు అకౌంట్లకు ఎంత ఛార్జీవేస్తారో? మా అకౌంట్ల పరిస్థితేమిటి? అని ఖాతాదారులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఎస్బీఐ ఊరటను కల్పిస్తూ చల్లని వార్తను అందించింది.

ఖాతాదారుల ఆందోళనలపై ఎట్టకేలకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్పందించి... కొన్ని అకౌంట్ల కస్టమర్లకు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీల నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు పేర్కొంది. స్మాల్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, బేసిక్ సేవింగ్స్ బ్యాంకు ఖాతాలు, జన్ ధన్ అకౌంట్లు లేదా ప్రభుత్వ ఫైనాన్సియల్ ఇంక్లూజివ్ స్కీమ్ ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద అకౌంట్లు ప్రారంభించిన వారికి మినిమమ్ బ్యాలెన్స్  ఉంచాల్సిన పరిమితి నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు గుడ్ న్యూస్ తెలిపింది.
 
ఈ ఖాతాలతో పాటు కార్పొరేట్ శాలరీ అకౌంట్లకు కూడా మినిమమ్ బ్యాలెన్స్  నుంచి విముక్తి కలిగిస్తున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఎస్బీఐ ట్వీట్ ద్వారా వెల్లడించింది. ఐదు అనుబంధ బ్యాంకులను, భారతీయ మహిళా బ్యాంకులను ఎస్బీఐ ఇటీవలే తనలో విలీనం చేసుకుని ప్రపంచంలోనే అత్యంత పెద్ద బ్యాంకుల జాబితాలో చేరిన తరుణలో ఎస్బీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో కోట్ల మంది ఖాతాదారులకు ఊరట కల్పించింది. దీనిపై ఖాతాదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles