వికెట్ కీపర్ గా పార్థివ్ పటేల్ అరుదైన ఘనత.. Parthiv Patel completes 2000 runs in IPL

Parthiv patel 7th wicket keeper to complete 2000 runs in ipl

brendon mccullum, dinesh karthik, Indian Premier League, ipl, IPL 10, IPL 2017, MS Dhoni, parthiv patel, robin uthappa

Parthiv Patel has over the years been a utility batsman for the Mumbai Indians side and has played some good knocks at the top of the order for the 'Blue Brigade'.

వికెట్ కీపర్ గా పార్థివ్ పటేల్ అరుదైన ఘనత..

Posted: 04/13/2017 07:41 PM IST
Parthiv patel 7th wicket keeper to complete 2000 runs in ipl

ఐపీఎల్‌-10వ సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ఆటగాడు పార్థివ్‌ పటేల్‌ అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్‌లో 2వేల పరుగులు పూర్తి చేసిన ఏడో వికెట్‌ కీపర్‌గా పార్థివ్‌ పటేల్‌ నిలిచాడు. పార్థివ్‌ ప్రస్తుత ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కి ప్రాతినిథ్యం వహిస్తోన్నాడు. సచిన్ తరువాత అత్యంత పిన్న వయస్సు క్రికెటర్ గా అంతర్జాతీయ క్రికెట్ లోకి అగమనం చేసిన పార్థివ్.. టీమిండియా జట్టులోకి పునరాగమనం చేసేందుకు కూడా రెడీగా వున్నాయి. అయితే అందుకు అందివచ్చిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను వినియోగించుకోవాలని భావిస్తున్నాడు.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పార్థివ్‌ పటేల్‌ 39పరుగులు సాధించాడు. ఇప్పటి వరకూ ఐపీఎల్‌లో 106మ్యాచ్‌లాడిన పార్థివ్‌ 104 ఇన్నింగ్స్‌ల ద్వారా 2015పరుగులు పూర్తి చేశాడు. రాబిన్‌ వూతప్ప 3,394పరుగులతో అత్యధిక పరుగులు సాధించిన వికెట్‌ కీపర్ల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 2014లోనే వూతప్ప 2వేల మార్కును అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్‌(3,346), మహేంద్ర సింగ్‌ ధోనీ(3,298), దినేశ్‌ కార్తీక్‌(2,619), బ్రెండన్‌ మెకల్లమ్‌(2,474), గ్రిల్‌క్రిస్ట్‌(2,069)లు ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles