పోస్టర్లతో సీఎం సమోసా కుంభకోణం బయటపడింది | Delhi CM's Samosa Scam Exposed on Posters.

Kejriwal now accused of a rs 1 crore samosa scam

Aam Aadmi Party, Samosa Scam, BJP Samosa Scam, Kejriwal Samosa Scam, Tea and Samosas AAP, Tajinder Pal Singh Bagga Kejriwal, Delhi CM Samosa Scam, Thali Scam Aravind Kejriwal, Thali Samosa Scam

After `thali scam`, Arvind Kejriwal now faces allegations of Rs 1 crore `samosa scam`. Aam Aadmi Party has been accused of a Rs 1 crore samosa scam. BJP's spokesperson, Tajinder Pal Singh Bagga put up posters in Delhi alleging that the Arvind Kejriwal led Delhi government had spent over Rs 1 crore of public money on tea and Samosas.

సమోసాల స్కాంతో రోడ్డుకెక్కిన సీఎం

Posted: 04/11/2017 10:50 AM IST
Kejriwal now accused of a rs 1 crore samosa scam

ఏదో ఒక వార్తతో హైలెట్ అవ్వటం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ క్రేజీ వాల్ కు సర్వసాధారణంగా మారిపోయింది. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి రెండేళ్లు గడుస్తున్న సందర్భంగా ఇచ్చిన ఓ పార్టీతో వివాదాల్లోకి ఎక్కాడు. రాష్ట్రపతి, ప్రధానులు నిర్వహించే బఫెట్ల కన్నా విలాసవంతమైన పార్టీ ఇవ్వటమే అందుకు కారణం.

తాజ్ ప్యాలెస్ నుంచి క్యాటెరింగ్ తెప్పించి మరీ రెండు రోజులపాటు ఈ విలాసవంతమైన పార్టీని నిర్వహించాడంట. ఇందుకోసం 12,000 తల ఒక్కోక్కరికి 12,000 రూపాయలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా 4.5 లక్షల ఖర్చు అవుతుందని భావించినప్పటికీ 11.04 లక్షలు ఖర్చైనట్లు లెక్కలు చూపారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యకర్తలు సహా అంతా దానికి హాజరయ్యారు.

కానీ, బీజేపీ నేత తాజిందర్ పాల్ సింగ్ బగ్గా మాత్రం ఆ లెక్క అంతకు మించే ఉందని చెబుతున్నాడు. అంతేకాదు ఏకంగా నగరం మొత్తం పోస్టర్లు పెట్టేశాడు. ఏడాదిన్నరగా కేవలం టీ, స్నాక్స్ కోసమే కోటి రూపాయలను ఆప్ ఖర్చు చేసిందని అందులో కార్టూన్లతో ప్రచారం చేస్తున్నాడు. ఇది ఇప్పటిదాకా అప్ డేట్ అయిన ఢిల్లీ సీఎంగారి సమోసా స్కాం వివరాలు. దీనిపై కేజ్రీవాల్ ఎలాంటి రియాక్షన్ ఇస్తాడో చూడాలి మరి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samosa Scam  Delhi CM Aravind Kejriwal  BJP Leader  Tajinder Pal Singh Bagga  

Other Articles