ఆ దాడులపై జవాబివ్వండీ.. అరు రాష్ట్రాలకు సుప్రీం శ్రీముఖాలు SC notices to 6 states on plea over cow vigilantes

Sc notices to 6 states on plea over legal protection to cow vigilantes

Supreme Court, Cow Vigilante Groups, legal protection, Tehseen Poonawala, Animal Protection Laws, Gau Rakshaks, Cow Protection, justice Dipak Misra, Uttar Pradesh, Rajasthan, Karnataka, Gujarat, Madhya Pradesh, Jharkhand.

SC issues notice to six states, seeks their responses in a plea challenging certain laws that give protection to vigilante cow protection groups in the country

ఆ దాడులకు మీరు రక్షణ కవచాలా..? సుప్రీం శ్రీముఖాలు

Posted: 04/07/2017 04:15 PM IST
Sc notices to 6 states on plea over legal protection to cow vigilantes

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో గో రక్షణ సమితి పేరిట జరుగుతున్న దాడులపై జవాబివ్వాలని కేంద్రాన్ని అదేశిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ నోటీసులను జారీ చేసింది. దీంతో పాటు బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో కూడా ఈ దాడులు మరింత తీవ్రస్థాయిలో వున్నాయని, ఈ దాడుల్లో పలువురు మరణిస్తున్నారని అవేధన వ్యక్త చేసిన కేంద్రం.. బీజేపి పాలిత ఆరు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. గో సంరక్షణ పేరిట జరుగుతున్న దాడులపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ అదేశించింది.

అటు కేంద్రంలో అధికారంలో వున్న మోడీ సర్కారుతో పాటుగా రాజస్థాన్‌, జార్ఖండ్‌, చత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాలకూ ఇవాళ శ్రీముఖాలను పంపింది. రాజస్థాన్‌లోని అల్వార్‌ లో ఓ ముస్లిం వ్యక్తిపై గో సంరక్షకులు దాడి చేయగా అతడు చనిపోయాడు. ఈ విషయం ఇప్పుడు అటు పార్లమెంటును కుదిపేస్తోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం అధికార పక్షంపై దీనితో దాడి చేస్తున్నారు. ఈ తరుణంలో దాఖలైన పిటీషన్ పై విచారించిన న్యాయస్థానం.. గో రక్ష దళాలకు శిక్షలు పడకుండా ప్రభుత్వమే రక్షణ కవచంలా వుంటుందా..? అని పిటీషనర్ అనుమానాలను వ్యక్తం చేస్తున్నరని.. ఈ విషయమై కూడా వివరణ ఇవ్వాలని అదేశించింది.

ఈ నేపథ్యంలో అల్వార్‌ ఘటనపై మూడు వారాల్లోగా వివరణ ఇవ్వాలంటూ రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుందర రాజేకు సుప్రీంకోర్టు నోటీసులు పంపించింది. పెహ్లూ ఖాన్‌ అనే వ్యక్తి గోవులను ట్రక్కులో తీసుకొని వెళుతుండగా ఎక్కడ కొనుగోలు చేశావని, ఎందుకు తీసుకెళుతున్నావని ప్రశ్నించి అనంతరం దాడి చేయడంతో అతడు చనిపోయిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వం మాత్రం అలాంటి ఘటనేది జరగలేదని రాజ్యసభలో చెప్పడంతో పెద్ద ధుమారం చెలరేగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles