కేంద్రమంత్రిపై దాడికి యత్నించిన శివసేన ఎంపీలు.. Shiv Sena MPs Charges at Minister Ashok Gajapathi Raju

Shiv sena mp anant geete charges at aviation minister ashok gajapathi raju

Shiv sena, Shiv sena MP, Anant Geete, Aviation Minister Ashok Gajapathi Raju, TDP MPs, Rajnath singh, Sushma swaraj, Ahluwalia, Ravindra Gaikwad, Gaekwad, Gaekwad flight ban, Shiv sena Ravindra Gaikwad, india news, ravindra gaikwad, shiv sena, air india, shiv sena mp, gaikwad air india, gaikwad shiv sena, lok sabha, parliament, Ravindra Gaikwad in lok sabha, all about Ravindra Gaikwad

In unprecedented scenes in parliament, a Shiv Sena lawmaker went charging at Civil Aviation Minister Ashok Gajapathi Raju, who had firmly refused to intervene on the flying ban on Ravindra Gaikwad

ITEMVIDEOS: కేంద్రమంత్రిపై దాడికి యత్నించిన శివసేన ఎంపీలు..

Posted: 04/06/2017 12:51 PM IST
Shiv sena mp anant geete charges at aviation minister ashok gajapathi raju

ఎట్టకేలకు శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ వెనక్కు తగ్గారని భావిస్తున్న తరుణంలో లోక్ సభలో ఊహించని పరిణామాం చోటుచేసుకుంది. రవీంద్ర గైక్వాడ్ విషయంలో వివరణ ఇచ్చిన కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ప్రకటనపై అసంతృప్తి వ్యక్తం చేసిన శివసేన ఎంపీలు పార్లమెంటు సాక్షిగా వీరంగం సృష్టించారు. లోక్ సభ వాయిదా పడగానే ఒక్కసారిగా కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుపైకి దూసుకువచ్చారు. ఆయనపై దాడికి యత్నించారు. పరిణామాని ఊహించని టీడీపీ ఎంపీలు షాక్ తిని.. ఆ తరువాత తేరుకుని అశోక్ గజపతిరాజుకు రక్షణగా నిలిచారు.

మరీ ముఖ్యంగా శివసేన ఎంపీ అనంత్ గీతే అశోక్ గజపతిరాజుతో కలబడడానికి వెళ్లినట్లుగా ప్రవర్తించారు. వివాదం పెద్దది కాకుండా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశీవ్యవహరాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ రంగంలోకి దిగి శివసేన ఎంపీలను వారించారు. ఇక అనంత్ గీతేను కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, అహ్లూవాలియాలు పక్కకు తీసుకువెళ్లి శాంతింపజేసేందుకు యత్నించారు. ఎయిరిండియా సహా విమానయాస సంస్థలు రవీంద్ర గైక్వాడ్ పై నిషేధం విధించిన అంశమై ఇవాళ లోక్ సభలో చర్చ జరిగింది.

దీనిపై గైక్వాడ్ వివరణ కూడా ఇచ్చారు. దానీపై అశోక్ గజపతి రాజు వివరణ ఇస్తూ ఎయిరిండియా ప్రభుత్వ రంగ సంస్థ అని.. అటు ప్రయాణికులతో పాటు ఇటు ఉద్యోగుల విషయంలోనూ తాము తగు చర్యలు తీసుకుంటామన్నారు. మరీ ముఖ్యంగా భద్రత విషయంలో ఎట్టి పరిస్తితుల్లో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని.. ఈ అంశంలో రాజీకి స్థానం లేదని కేంద్రమంత్రి చెప్పడాన్ని అపార్థం చేసుకున్న శివసేన ఎంపీలు.. ఆయనపై దాడికి యత్నించారు. ఎయిరిండియా-గైక్వాడ్ విషయంలో విచారణ జరుగుతుందని.. ఆయన చెప్పడంపై అసంతృప్తితో రగిలిపోయిన శివసేన ఎంపీలు సభ వాయిదా పడగానే లోక్ సభ సాక్షిగా గంధరగోళం సృష్టించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv sena  Anant Geete  Ashok Gajapathi Raju  Ravindra Gaikwad  parliament  Air India  

Other Articles