‘‘ఆయన అక్కడ ఇరుక్కోకుండే ప్రత్యేకహోదా ఎప్పుడో వచ్చేది’’ Chandrababu is suppressing AP special status issue alleges actor shivaji

Chandrababu is suppressing ap special status issue alleges actor shivaji

Shivaji, AP Special Status, Chandrababu Naidu, Actor Shivaji, Andhra Pradesh, Chief Minister, AP Sadhana Samithi President, cash for vote scam, Pattiseema project.

Actor Shivaji has once again raised the issue of special status category for Andhra Pradesh. Stating that CM Chandrababu Naidu is suppressing the issue

‘‘ఆయన అక్కడ ఇరుక్కోకుండే ప్రత్యేకహోదా ఎప్పుడో వచ్చేది’’

Posted: 04/04/2017 05:42 PM IST
Chandrababu is suppressing ap special status issue alleges actor shivaji

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్కడి అత్యాశ వల్లే ఇవాళ యావత్ రాష్ట్ర యువత భవిష్యత్తు అంధకారమయమైందని సినీనటుడు, ఏపీ సాధన సమితి అధ్యక్షుడు శివాజీ అరోపించారు. ఏపీలో అధికారంలో వున్న తమ పార్టీ.. అటు తెలంగాణాలోనూ ఉనికి చాటాకోవాలని భావించిన చంద్రబాబు.. ఎమ్మెల్యే ఓటును కొనుగోలు చేసేందుకు యత్నించి ఏసీబి అధికారులకు అడ్డంగా దొరికిపోయారని దాంతోనే బ్లాక్ మెయిల్ చేస్తున్న కేంద్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా చేసిందని అభిప్రాయపడ్డారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఇరుక్కోకుంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏనాడో లభించి వుండేదని పేరన్కోన్నారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానాకి వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... కేసుల్లో ఇరుక్కుని, కేంద్రం చెప్పినదానికల్లా చంద్రబాబు తలూపాల్సిన పరిస్థితిని తెచ్చుకున్నారని విమర్శించారు. దీనికి తోడు పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం, లోపభూయిష్టపు పనులు కూడా ప్రత్యేక హోదా అవరోధంగా నిలిచాయని అరోపించారు.

ప్రత్యేక హోదా వల్ల ప్రయోజనం శూన్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబే స్వయంగా ప్రచారం చేస్తుండటాన్ని శివాజీ తప్పుబట్టారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఈ విషయాన్నే చంద్రబాబు ఎందుకు ప్రచారం చేయలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు చెబుతున్న కథలను ప్రజలు వింటున్నారని, ఇక ఈ విషయంలో మాట్లాడేది ఏముందని ఆయన మీడియానే ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబు ఏం చెబితే అదే మహాభారతం, రామాయణం అయిపోయిందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు, పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతిపై విచారణ లేకుంటే హోదా ఎన్నడో వచ్చేదన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Special Status  Chandrababu Naidu  Actor Shivaji  Andhra Pradesh  

Other Articles