కోపిష్టి ‘కోబ్రా’ ఎంత కూల్ గా తాగుతుందో చూడండి | Thirsty King Cobra Sips From Water Bottle.

Angry king cobra is given water by botltle

King cobra, King cobra Video, King cobra Water Video, Thirsty King cobra, Angry King cobra Cool, Water Bottle king Cobra, King Cobra Sips Water, King Cobra Drinking Water, King Cobra Sips Karnataka Video, King Cobra Water, Thirsty King Cobra, King Cobra Life Saved

King cobra given life-saving drink from water bottle after it entered Indian village during drought.

ITEMVIDEOS:దారి తప్పి మంచి నీటి కోసం వస్తే...

Posted: 03/30/2017 08:39 AM IST
Angry king cobra is given water by botltle

ఎల్ నినో ఎఫెక్ట్ తో వేసవి రాకముందే ఎండలు భయంకరంగా దంచేస్తున్నాయ్. దానికి తోడు నీటి సమస్య కూడా అప్పుడే మొదలైంది. మనకే ఇలా ఉంటే .. పాపం మూగ జీవాల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో సరస్సులు, కొలనులు ఎండిపోతుండటంతో మూగజీవాలు జనావాసాల మీదకు వచ్చేస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇది కొత్తేం కాకపోయినా కర్ణాటకలో జరిగిన ఓ ఘటన మాత్రం అందరినీ ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కరువు మొదలైంది. ఎటు చూసినా తాగు నీరు కనిపించడం లేదు. కైగా పట్టణానికి సమీపంలోని ఓ కుగ్రామం పక్కనే ఓ అటవీ ప్రాంతం ఉంది. అందులో ఉన్న 12 అడుగుల ఓ కింగ్ కోబ్రా (నల్లతాచు)కు పాపం బాగా దాహం అయ్యింది. అంతే జనావాసాల్లోకి చొరబడింది. దీంతో జనాలంతా భయాందోళనకు గురయ్యారు.

 

ఇంతలో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించగా వారొచ్చి దాన్ని పట్టుకునే యత్నం చేశారు. అయితే దానిని చూసిన ఓ అధికారికి మాత్రం అసలు విషయం అర్థమైంది. అంతే ధైర్యం చేసి ఓ వాటర్ బాటిల్ తో దానికి నీరు పట్టించారు. సాధారణంగా మనుషులు కనిపిస్తేనే కోపంతో అంతెత్తున లేచి విషం చిమ్మే కోబ్రా కూల్ గా వాటర్ ను తాగేసింది. ఆపై అధికారులు దానిని జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు. ధైర్యం చేసి దానికి నీరు తాగించిన వ్యక్తిని అంతా అభినందించారు. ఓ వ్యక్తి దానిని నెట్ లో అప్ లోడ్ చేయగా, అంతర్జాతీయ మీడియాలో కూడా అది హైలెట్ అయ్యింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : King Cobra  Drought Village  Water Sip Bottle  

Other Articles

Today on Telugu Wishesh