గుండె బద్ధలయ్యే గ్యాంగ్ రేప్.. అంతా ఫేక్ | Minister announced that Bikaner rape case stands fake.

New twist in bikaner rape case

Bikaner Rape Case, Women Welfare Minister Anita Bhadel, Anita Bhadel Bikaner Rape Case, Rajasthan Rape Case, Fake Rape case, Rape case False, Bikaner School Girl Rape, Girl Father Rape Case, Fake Rape case, Sensational Rape Case, Father Revenge School

Bikaner Rape Case Takes a U-Turn, Victim's Father Allegedly Lied. In his statement girls father says his 13-Year-Old girl allegedly raped by 8 teachers For A Year in her school. But, the father had concocted charges of rape on his daughter by the teachers, as he wanted to take revenge on the school. Rajasthan Child and Women Welfare Minister Anita Bhadel stated that facts have emerged revealing that the entire rape case stands false.

సంచలన గ్యాంగ్ రేప్.. షాకింగ్ టర్న్

Posted: 03/28/2017 10:12 AM IST
New twist in bikaner rape case

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బికనీరు రేప్ కేసు కొత్త మలుపు తిరిగింది. 13 ఏళ్ల బాలికపై ఎనిమిది మంది ఉపాధ్యాయులు సాముహిక అత్యాచారం చేయటం, ఆమె మర్మాంగాలను తీవ్రంగా గాయపడటమే కాదు, గర్భం రాకుండా బలవంతంగా మాత్రలు మింగించటంతో బ్లడ్ కాన్సర్ వచ్చి ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటం తెలిసిందే. 2015 లో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన జరగ్గా, గత వారం తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో భద్రత కల్పించలేని ప్రభుత్వం అంటూ ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. కానీ విచారణలో అదంతా ఉత్తదేనని ఇప్పుడు తేలింది. అంతేకాదు ఆ కేసులో ప్రతీకార కోణాన్ని ఇప్పుడు బయటపెట్టారు పోలీసులు.

విద్యార్థిని అత్యాచారం కేసు తప్పుడుదని ఆ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనితా బడేల్ ప్రకటించారు. తన 13 సంవత్సరాల కుమార్తెపై ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఏడాదిన్నరగా అత్యాచారం చేశారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా, నిజాన్ని వెలికితీయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని స్వయంగా సీఎం వసుంధరా రాజే సైతం ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించారు.

ఆ బాలిక నాలుగేళ్ల నుంచి అసలు స్కూలుకే వెళ్లడం లేదని, ఆమెపై టీచర్ల లైంగికదాడి అవాస్తవమని తేలిందని అనితా చెప్పారు. గతంలో పాఠశాల యాజమాన్యం బాలిక తండ్రిపై కేసు పెట్టగా, దానికి ప్రతీకారంగా ఈ అసత్య ఆరోపణలు చేశాడని తేలిందన్నారు. టీచర్లపై నమోదైన కేసును తొలగిస్తామని అన్నారు. తనది తప్పుడు ఫిర్యాదేనని, పరిస్థితుల ప్రభావంతోనే తాను అలా చేశానని బాలిక తండ్రి అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajasthan  Bikaner Rape Case  False Complaint  

Other Articles