ఇక మొబైల్ ఫోన్లకు ఆధార్ నెంబర్లు లింక్.. Aadhaar must for procuring new SIM

Telcos asked to link over 1bn numbers with aadhaar

telco aadhaar, mobile number aadhaar, mobile aadhaar link, Cellular Operators Association of India, aadhaar link cellular, aadhaar supreme court

Unverified mobile phone numbers or any number that is not linked to Aadhaar, will be illegal after February 6, 2018 and such connections will be disconnected.

ఇక మొబైల్ ఫోన్లకు ఆధార్ నెంబర్లు లింక్..

Posted: 03/25/2017 06:09 PM IST
Telcos asked to link over 1bn numbers with aadhaar

మీరు మొబైల్ ఫోన్ వినియోగదారులేనా.. అయితే మీ ఆధార్ నెంబర్ మీకు తెలుసా..? గుర్తుంటే పర్వాలేదు.. అలా లేని పక్షంలో మీ ఆధార్ నెంబర్ ను వెంటనే రాసి పెట్టుకోండి సాధ్యమైతే మీ ఆధార్ నెంబర్ జిరాక్స్ కాఫీని కూడా తీసిపెట్టుకోండి. మీ మొబైల్ ఫోన్ టెలికాం సంస్థ నుంచి త్వరలో మీకు ఓ ఫోన్ కాల్ రావచ్చు. మీ అధార్ నెంబర్ ను పంపాలని, లేక పలానా నెంబర్ కు మీ అధార్ నెంబర్ ను ఎస్ఎంఎస్ చేయాలని చెప్పవచ్చు. అదీకాకపోతే మీకు దగ్గర్లో వున్న సంస్థ కార్యాలయానికి వెళ్లి మీ ఫోన్ నెంబర్ రాసి మీ అధార్ నెంబర్ జిరాక్స్ కాపీని ఇవ్వాలని కూడా అదేశించవచ్చు.

ఎందుకంటే త్వరలో కొత్త సర్వే ప్రారంభంకానుంది. దేశంలోని అనేక మంది ఫేక్ అడ్రస్ లు, నకిలీ గుర్తింపుకార్డుల పేరుతో అనేక సిమ్ కార్డులు తీసుకున్నారని దీంతో ఎవరు వారు సంఘవిద్రోహ కార్యకాలపాలతో పాటు అకతాయి పనులకు కూడా పునుకుంటున్నారని, వీరి ఫోన్ నెంబర్ అధారంగా దర్యాప్తు సంస్థలు తనిఖీలు చేసినా.. వారి ఆచూకీ అంతా తప్పని తేలుతుందని పిల్ దాఖలైన నేపథ్యంలో దానిపై విచారించిన దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ మేరకు టెలికాం సంస్థలకు అదేశాలు జారీ చేసింది.

ఇన్నాళ్లు ఏదో ఒక గుర్తింపు వుంటేనే దక్కిన సిమ్ కార్డులకు ఇకపై తప్పనిసరిగా ఆధార్ నెంబర్ వుండాల్సిందే. దీంతో టెల్కో సంస్థలు ఇకపై ఆదార్ నెంబర్ లేకుండా కొత్త సిమ్ కార్డులు జారీ చేయడానికి విముఖత వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాదు ఇప్పటి వరకు జారీ చేసిన సిమ్ కార్డులకు కూడా ఆధార్ నెంబర్లు సేకరించాలన్న అత్యున్నత న్యాయస్థానం అదేశంలో ఇకపై కస్టమర్ల నుంచి ఆధార్ నెంబర్లను సేకరించే పనిలో పడ్డాయి టెలీ కమ్యూనికేషన్ సంస్థలు. అయితే మొత్తంగా 110 టెలికాం వినియోగదారుల ఆధార్ నెంబర్లను సేకరించాలంటే ఏకంగా 2500 కోట్ల రూపాయల వ్యయం ఖర్చవుతుందని సంస్థలు సుప్రీంకోర్టుకు తెలిపాయి.

అయినా సరే.. వినియోగదారుల నుంచి స్పష్టమైన గుర్తింపు కింద ఆధార్ కార్డులను వివరాలను సేకరించాల్సిందేనని సర్వోన్నత న్యాయస్థానం అదేశింది. వచ్చే ఏడాది పిబ్రవరి 8 నాటికి మొబైల్ ఫోన్ వినియోగాదారుల వివరాలన్నీ కూడా ఆయా టెలికాం సంస్థల వద్ద వుండాలని న్యాయస్థానం అదేశించింది. అయితే ఇప్పటికే టెలికాం సంస్థల మధ్య తీవ్రమైన టారిఫ్ వార్ నడుస్తున్న నేపథ్యంలో కోట్లాది రూపాయల ఖర్చు చేయాల్సి వస్తుందని టెలికాం కంపెనీలు ఊసురుమంటున్నాయి. అయినా తప్పని పరిస్థితి. అయితే వివరాలను సేకరించే విషయంలో ఎలా చేయాలన్న విషయమై ఇంకా ఓ కొలిక్కి రాలేదని కూడా చెబుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles