భార్యను రేప్ చేస్తున్నారంటూ ఫోన్ చేస్తే ఆ మంత్రి ఏం చేశాడో తెలుసా? | What Uttarakhand minister did after getting call from husband.

Uttarakhand minister helps woman from harassment

Uttarakhand Minister, Prakash Pant, Prakash Pant Phone Call, Uttarakhand Minister Save woman, Dehradun Directorate of Information , Sexual Harassment in Government Office, Uttarakhand Woman Harassment

Uttarakhand minister Prakash Pant helps woman from harassment after getting phone call in Directorate of Information in Dehradun.

కొత్త మంత్రి ఫోన్ కాల్ ఎంత పని చేసింది

Posted: 03/22/2017 09:36 AM IST
Uttarakhand minister helps woman from harassment

సమస్యల సత్వర పరిష్కారానికి మన నేతలు ఎంత చిత్తశుద్ధితో పని చేస్తారో లేదో తెలీదుగానీ ఇక్కడో మంత్రి చేసిన పని మాత్రం ఓ మహిళ జీవితాన్ని కాపాడిందనే చెప్పుకోవచ్చు. తన భార్యపై అఘాయిత్యానికి ప్రయత్నిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేస్తే సత్వరమే స్పందించిన ఆ మంత్రి వేధింపులను అడ్డుకునేలా చర్యలు తీసుకోవటమే కాదు, ఆ కిరాతకులను కటకటాల వెనక్కి నెట్టేలా చేసింది.

సమాచార హక్కు చట్టం కింద ఓ కేసు నమోదు కావటంతో విచారణ కోసం ఆదివారం ఓ దంపతులు డెహ్రాడూన్ సమాచార హక్కు కార్యాలయానికి వచ్చారు. సమయం గడిచిపోవటంతో భోజనం చేసి రాత్రి 11 గంటల సమయంలో కార్యాలయంలోనే నిద్రించారు. ఆ ఆఫీస్ లోనే పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు మహిళపై కన్నేసి మరో ఇద్దరు స్నేహితులను పిలిపించుకుని వేధింపులకు దిగారు. అడ్డుకున్న భర్తను చితకబాదటమే కాదు, మహిళపై అఘాయిత్యానికి ప్రయత్నించబోయారు. వెంటనే సదరు వ్యక్తి పితోఘర్ ఎమ్మెల్యేకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.

ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రకాశ్ పంత్. మొన్న జరిగిన ఉత్తరాఖండ్ కేబినెట్ విస్తరణలో మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించాడు. వెంటనే ఎస్ఎస్పీ స్వీటీ అగర్వాల్ కు ఫోన్ చేసిన పంత్ వారిని ఆదుకోవాలని ఆదేశించాడు. ఆవెను వెంటనే సిబ్బందితోసహా బయల్దేరిన ఆయన నిందితులను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. డైరెక్టరేట్ ఉద్యోగులు జగ్మోహన్ సింగ్ చౌహాన్, అనిల్ రావత్, హరిసింగ్ పెత్వాల్ మరియు జగదీశ్ సింగ్ (టీ స్టాల్ యజమాని) లపై సెక్షన్ 354(ఏ) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒకవేళ ఆయన గనుక ఆలస్యంగా స్పందించి ఉంటే ఘోరం జరిగి ఉండేదన్న సదరు బాధిత భర్త మంత్రికి కృతజ్నతలు తెలియజేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Minister Prakash Pant  Uttarakhand  Save Woman  Sexual Harassment  

Other Articles