వంగలపూడి వర్సెస్ గిడ్డి.. కాస్తుంటే డిష్యూం.. డిష్యూమే! | AP Woman MLAs word war At Assembly Media Point.

Tdp and ycp woman mlas fight at assembly media point

Anitha Giddi Eswari, TDP and YSRCP Woman MLAs, Woman MLAs at Assembly Media Point, AP Assembly Media Point, Woman MLAs Word Fight, MLA Anitha Versus Giddi Eswari

Words Fight Between TDP and YSRCP Woman MLAs at Assembly Media Point. Lady Marshals Control the situation before it turns worst.

ITEMVIDEOS:అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద రచ్చ

Posted: 03/21/2017 12:45 PM IST
Tdp and ycp woman mlas fight at assembly media point

అమరావతి సాక్షిగా జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సభలోనే కాదు, బయటకూడా మాటల తూటాలు పేలుతున్నాయి. మంగళవారం జరిగిన సమావేశంలో జగన్ వ్యవహారశైలిపై అధికారపక్షం విరుచుకుపడగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సభను వాయిదా వేయగా, అక్కడే అసలు సీన్ మొదలైంది.

మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే అనిత, వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిలు సవాళ్లు విసురుకున్నారు. ఒకానోక సమయంలో ఇద్దరూ తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధానికి దిగారు. సీఎం చంద్రబాబు తల నరుకుతానని తాను ఎన్నడూ అనలేదని, అది నిజమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని గిడ్డి ఈశ్వరి స్పష్టం చేయగా... సీఎం తల నరుకుతానని ఈశ్వరి అన్నట్టు పోలీసు విచారణలో తేలిందని అనిత కౌంటర్ ఇచ్చింది.

టీడీపీ పాలనలో మహిళలపై దాడులు ఎక్కువయ్యాయని ఈశ్వరి అనగా... ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు వైసీపీ యత్నిస్తోందని అనిత మండిపడ్డారు. మరోవైపు, మైకుల కోసం ఇరు పార్టీల మహిళా ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నారు. దీంతో. మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో, అక్కడకు మార్షల్స్ చేరుకున్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు లేడీ మార్షల్స్ తో పాటు పోలీసులు రంగంలోకి దిగారు. తమ మహిళా ఎమ్మెల్యేలకు రక్షణగా వైకాపా ఎమ్మెల్యేలు రంగంలోకి దిగడంతో పరిస్థితి విషమించింది.

 

ఒక దశలో మహిళా శాసనసభ్యులు ఒకరిని ఒకరు తోసుకుంటూ, మైకులు లాక్కుంటూ కనిపించారు. తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. ఆపై మార్షల్స్ సాయంతో వైకాపా ఎమ్మెల్యేలను లాగేశారు. ఆ సమయంలో గిడ్డి ఈశ్వరి తీవ్ర అభ్యంతరం తెలుపుతూ, తమపై కండబలం చూపుతున్నారని, పోలీసులతో కొట్టిస్తున్నారని ఆరోపించారు. "నన్ను తాకొద్దు. నేనేం తప్పు చెయ్యలేదు" అని అరుస్తూ మార్షల్స్ పై విరుచుకుపడ్డారు. వైకాపా సభ్యులను అక్కడి నుంచి మార్షల్స్ తరలించగా, తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు మాట్లాడిన అనంతరం సభ మళ్లీ మొదలైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP Assembly  Media Point  TDP and YSRCP  Woman MLAs  Word Fight  

Other Articles