తనతో గొడవ పడ్డందుకు ఓ నేత కొడుకు ఎంతటి ఘోరం చేశాడో తెలుసా? | Youth assaulted run over by car in Haryana village.

Haryana politician son booked by police for barbaric murder

INLD Leader Son, Haryana Politician Son, Manmeet Singh Waraich, Varinder Singh, Man Dragged by Car, Haryana Man Brutually Killed, Politician Son Arrest, Gurpreet Kaur Waraich Son, Barbaric Murder

Haryana man dies after son of INLD leader allegedly attacked him with swords, dragged him with car. 26-year-old Varinder Singh dies in this shocking incident.

నడిరోడ్డుపై అంతా చూస్తుండగానే కిరాతకం

Posted: 03/15/2017 12:56 PM IST
Haryana politician son booked by police for barbaric murder

తండ్రి అధికారంలో ఉన్నాడన్న మదంతో ఓ నేత కొడుకు చేసిన కిరాతకం సంచలనం రేపుతోంది. తనతో గొడవ పెట్టకున్నాడన్న కక్షతో ఓ యువకుడిని ఇంట్లోకి దూరి మరీ కత్తులతో దాడి చేశాడు. ఆపై పాశావికంగా హత్య చేసిన ఘటన ఛంఢీగఢ్ లో ఆలస్యంగా ఎదురు చూసింది.

ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ నేత, కౌన్సిలర్ అయిన గురుప్రీత్‌ కౌర్‌ వరైచ్‌ కుమారుడు మన్మీత్‌ సింగ్‌ వరీందర్ అనే యువ‌కుడితో కొన్ని రోజుల క్రితం గొడవ పడ్డాడు. సాకేత్రి గ్రామానికి చెందిన వరీందర్ చిన్న తనంలోనే తండ్రిని కోల్పోవటంతో తల్లిని బంధువుల ఇంట్లో ఉంచి, పాంచ్ కుల లో నివసిస్తూ ఓ చిన్న కంపెనీలో ఉద్యోగం కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం మన్మీత్ తో వరీందర్ కు గొడవైంది.

వరీందర్‌పై పగ పెంచుకున్న మన్మీత్ డజను మంది స్నేహితులతో కలిసి అతని ఇంటిపై దాడి చేశాడు. ఇంట్లో భోజనం చేస్తుండగా ప్ర‌వేశించిఆ యువ‌కుడిని తీవ్రంగా కొట్టారు. అనంత‌రం కారుకు కట్టేసి అంద‌రూ చూస్తుండ‌గానే నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. దీంతో తీవ్ర గాయాలపాల‌యిన ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా వరీందర్ ను హింసించారని దగ్గరి బంధువైన హర్ దీప్ సింగ్ చెబుతున్నాడు. మన్మీత్ రాజకీయ నేత కొడుకు కావటంతో ఫిర్యాదు తీసుకునేందుకు కూడా పోలీసులు తొలుత విముఖత వ్యక్తం చేశారని అతను తెలిపాడు. కాగా, ఘటన జరిగిన అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోగా, కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఇప్ప‌టికే ఇద్ద‌రు నిందితుల‌ని అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Haryana  Gurpreet Kaur Waraich  Politician Son  Killed Youth  

Other Articles