చిర్రెత్తుకోచ్చిన చిదంబరం.. బీజేపిని ఎమని ప్రశ్నించాడో తెలుసా..? Chidambaram Questions BJP's Strategy in UP Assembly Polls

Chidambaram questions bjp s strategy in up assembly polls

Assembly elections 2017, P Chidambaram, UP elections, UP Elections 2017, BJP Stategy, sab ka saath, sab ka vikas, minority community, Uttar Pradesh

Congress leader P Chidambaram wondered if it is possible to ensure long term economic growth by excluding the largest minority community or women or backward communities from Assembly polls.

చిర్రెత్తుకొచ్చిన చిదంబరం.. బీజేపిని ఏమని ప్రశ్నించాడో తెలుసా..?

Posted: 03/14/2017 07:05 PM IST
Chidambaram questions bjp s strategy in up assembly polls

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో అత్యంత కీలకమైన ఉత్తర్ ప్రదేశ్ లో గెలుపోందిన బీజేపి.. మాటలకు చేతలకు అసలు పొంతన లేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం ఎద్దేవా చేశారు. మైనారిటీలను విస్మరించి.. సమగ్రాభివృద్ది సాధిస్తామని ఎలా ప్రకటిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహంపై  పీ చిదంబరం సూటి ప్రశ్నాస్త్రాలు సంధించారు. దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గాన్ని, మహిళలను, అట్టడుగు వర్గాలను ఎన్నికల్లో విస్మరించడం ద్వారా సమగ్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు.

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని ప్రస్తావించిన ఆయన తమ పార్టీ తరపున ముస్లిం మైనారిటీలకు అసలు టికెట్లే ఇవ్వకుండా చేసి,, ఆయా వర్గాల రాజకీయ విసాకాసానికి ఎలా దోహదపడతారిని ఆయన ప్రశ్నించారు. బీజేపి అనుసరిస్తున్న విధానాలను తప్పుబడుతూ.. 19.3శాతం ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్‌ ఇవ్వకుండా బీజేపీ ఈ విజయాన్ని ఎలా సాధించిందని అనుమానాలను వ్యక్తం చేశారు. దీంతో ’సబ్‌ కా సాథ్‌, సబ్‌ కా వికాస్‌’  అన్న నినాదానికి సరికొత్త సంకుచిత అర్థం ఇచ్చినట్టు అయిందని ఆయన దుయ్యబట్టారు.

ఒక జాతీయ పార్టీ అసలు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపకపోవడం, లేదా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వు చేయబడిన స్థానాల్లో అసలు అభ్యర్థులనే నిలబెట్టకపోవడంతో బీజేపి ఉత్తర్ ప్రదేశ్లో బీజేపి స్ట్రాటజీని సరిపోల్చాతూ  చిదంబరం బీజేపీ తీరును తప్పుబట్టారు. న్నైలో హిందూ సెంటర్‌ ఫర్‌ పాలిటిక్స్‌ అండ్‌ పబ్లిక్‌ పాలసీలో నిర్వహించిన ’నిరంతరాయ వృద్ధిని భారత్‌ సాధిస్తుందా’  అన్న అంశంపై చిదంబరం ప్రసంగించారు. అతిపెద్ద మైనారిటీ వర్గాన్ని, మహిళలను, ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల్లో విస్మరించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని సాధించడం సాధ్యమా అని ఆయన సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles