ఒక్క విక్టరీతో బీజేపీ రెండు కలలు తీరబోతున్నాయి.. ఎలాగంటే... | BJP UP Victory effect on Presidential Election and Rajya Sabha members.

Up win will impact on bjp s two dreams

Uttar Pradesh Assembly Elections, BJP Victory, BJP Presidential Elections, BJP Rajya Sabha Members List, BJP Cash UP Victory, BJP President Candidate

The BJP's Uttar Pradesh Assembly Victory will not just dramatically change the party's numbers in the assembly but will have an immediate impact on the next Presidential elections in July when President Pranab Mukherjee completes his term.These results will also change the dynamics in the Rajya Sabha where the NDA government is in minority. In August 2018, 10 Rajya Sabha members of UP including BSP chief Mayawati will retire.

యూపీ ఎఫెక్ట్ : బీజేపీ రెండు కలలు ఒకేసారి...

Posted: 03/14/2017 09:42 AM IST
Up win will impact on bjp s two dreams

యూపీ ఎన్నికల్లో సునామీ సృష్టించిన బీజేపీకి అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బలమే కాదు, మరోకటి కూడా అదనంగా జత చేరిందిప్పుడు. జూలైలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ఓటు బ్యాంకు పెను ప్రభావమే చూపనుంది. నిజానికి రాష్ట్రపతి అభ్యర్థిని సొంతంగా నిలబెట్టి, గెలిపించుకోవాలనేది బీజేపీ కల. కానీ, యూపీఏ ప్రభుత్వ హయాంలలో అది కుదరలేదు. ఇక ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో అది ఇప్పుడు నెరవేరనుంది.

అందుకు సంబంధించిన లెక్కలు ఇలా ఉన్నాయి. పార్లమెంటు మొత్తం ఉభయ సభల సభ్యులు, దేశంలోని అన్ని అసెంబ్లీల ఎమ్మెల్యేలు గల ఎలక్టరోల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. వీరిలో ఒక్కో ఎంపీ ఓటు విలువ 708 ఓట్లు. ఇక, ఎమ్మెల్యే ఓటు విలువ ఆయా రాష్ట్రాల్లోని జనాభా ప్రాతిపదికను బట్టి ఉంటుంది. గరిష్టంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టరోల్ కాలేజ్ మొత్తం ఓట్లు 10,98,882 ఉంటాయి.

ఇందులో సగం ఓట్లు అంటే సుమారు 5.49 లక్షల ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించవచ్చు. బీజేపీ ఇప్పటికే 282 లోక్ సభ సభ్యులను, 56 రాజ్యసభ సభ్యులను, 1126 మంది ఎమ్మెల్యేలను (తాజాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో కాకుండా) కలిగివుంది. ఉత్తరప్రదేశ్ 325, ఉత్తరాఖండ్ 57, మణిపూర్ 21, గోవాలో 13 మంది ఎమ్మెల్యేలను బీజేపీ గెలుచుకుంది. ఈ ఐదు రాష్ట్రాల్లో ఉన్న మొత్తం ఓట్లు 1,03,756.

అంటే తాజా ఫలితాలతో ఒక్క యూపీ నుంచే ఎన్డీయేకు 67,600 ఓట్లు వచ్చాయి. ఉత్తరాఖండ్‌ నుంచి 3648 ఓట్లు వచ్చాయి. ఇక, పంజాబ్‌, గోవా, మణిపూర్‌లలో బీజేపీకి వచ్చిన సీట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఎవరి మద్దతు లేకుండానే నేరుగా తమ అభ్యర్థిని రాష్ట్రపతిగా గెలిపించుకునే అవకాశం బీజేపీకి దక్కింది. మొత్తానికి ఐదు రాష్ట్రాల శాసనసభల్లో బలాబలాలను మార్చడంతో, ఈ ఏడాది జూలైలో జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు కమలం సిద్ధమైపోతుంది.

ఇంకోవైపు రాజ్యసభలో సభ్యులను పెంచుకునేందుకు కూడా పావులు కదుపుతోంది. ఇప్పటిదాకా బీజేపీకి పెద్దల సభలో సరైన బలమే లేదు. ఈ కారణంగానే కీలక బిల్లుల సమయంలో ప్రతిపక్షాలను బతిమాలుకోలేక చాలాసార్లు ఇబ్బందులుకు గురైంది కూడా. ఈ ఆగష్టులో 58 మంది సభ్యులు రిటైర్ అవుతుండగా, అందుకే ఈసారి ఛాన్స్ మిస్ చేసుకోకూడదని డిసైడ్ అయిపోయింది. ఎలాగైనా సగం స్థానాలు దక్కించుకునేందుకు యత్నాలు మొదలుపెడుతోంది. ఒక్క యూపీ నుంచే 10 మంది సభ్యుల పదవీకాలం ముగుస్తుండగా, అందులో బీఎస్పీ చీఫ్ మాయవతి కూడా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Uttar Pradesh  Assembly Elections  Presidential Candidate  

Other Articles