సరిహద్దులో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు Kashmir: Policeman, two militants killed in Tral encounter

Kashmir policeman two militants killed in tral encounter

Kashmir, Tral encounter, Hizbul Mujahedeen militant, Kashmir unrest, Burhan Wani, Manzoor Ahmed Naik

Two militants and a policeman were killed in south Kashmir’s Tral on Sunday in an encounter that began Saturday evening and continued over night.

సరిహద్దులో మళ్లీ పేట్రేగిన ఉగ్రవాదులు.. కొనసాగుతున్న ఎన్ కౌంటర్

Posted: 03/05/2017 10:21 AM IST
Kashmir policeman two militants killed in tral encounter

సరిహద్దులో మరోమారు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అక్రమంగా భారత్ లోకి వచ్చి భారత భద్రతా దళాలను టార్గెట్ చేస్తున్న ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పుల్వామా జిల్లాలోని త్రాల్‌ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీస్‌ కానిస్టేబుల్ మృతి చెందాడు. మరో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. మృతి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్ను మంజూర్‌ అహ్మద్‌గా గుర్తించారు.

ఆ ప్రాంతంలో ఉన్న నక్కిన ఉగ్రవాదుల కోసం బలగాలు ఆపరేషన్‌ చేపట్టాయి. భద్రతా బలగాల కాల్పుల్లో అకిబ్ మోల్వితో పాటు మరో హిజ్బుల్‌ ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులు నక్కిన భవనాన్ని భద్రతా బలగాలు ధ్వంసం చేసి ఆపరేషన్ నిర్వహించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కూంబింగ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh