పాత పెద్ద నోట్లు ఎలా వాడుతున్నారో తెలుసా..? Teen jumps to death in Snapchat stunt gone wrong

Teen jumps to death in snapchat stunt gone wrong

social media video, youth jumps, jonathan chow, singapore mall, Orchard Central, ORCHARD ROAD, ACCIDENTS, CCTVS, SHOPPING mall, Snapchat video

scraped old high value notes used as balancers in tamil nadu which are found toren in bags in pond

ITEMVIDEOS: ప్రాణం తీసిన పోషల్ మీడియా పోస్టు

Posted: 03/04/2017 06:33 PM IST
Teen jumps to death in snapchat stunt gone wrong

సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడం కోసం నాలుగో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు కోల్పోయాడో యువకుడు. ఈ ఘటన సింగపూర్‌లోని ఓ షాపింగ్ మాల్‌లో జరిగింది. జొనాథన్ చో (17) అనే ఈ యువకుడు తన స్నేహితురాలితో కలిసి మాల్‌కు వెళ్లాడు. అక్కడ తాను పైనుంచి సన్‌ షేడ్ మీదకు దూకుతానని, అదంతా వీడియో తీయాలని ఆమెను కోరాడు. అయితే.. ఆ సన్‌షేడ్ ప్లాస్టిక్ బోర్డుతో చేసినది కావడంతో అంత ఎత్తు నుంచి వచ్చిన అతడి బరువును ఆపలేకపోయింది. అతడు దాని మీద పడగానే అది కాస్తా కూలిపోయింది. దాంతో పైనుంచి తన స్నేహితురాలు చూస్తుండగానే అతడు ప్రాణాలు కోల్పోయాడు.

ఆస్ట్రేలియాలో చదువుకుని, సింగపూర్‌లో తన నేషనల్ సర్వీస్ పూర్తి చేసేందుకు వచ్చిన జొనాథన్.. ఇలా సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాలు కోల్పోయాడు. సన్ షేడ్ కాంక్రీటుతో చేసి ఉంటారని ఇద్దరం అనుకున్నామని, కానీ అతడు దూకగానే అది పడిపోయిందని అతడి స్నేహితురాలు రూత్ చెప్పింది. అక్కడి నుంచి దూకడం ప్రమాదకరమని తాను చెప్పేలోపే అతడు దూకేశాడని, తాను కూడా దూకుదాం అనుకున్నాను గానీ.. తర్వాత తెలిసిందని వివరించింది. అటువైపు వెళ్తున్న నలుగురు అతడిని కాపాడేందుకు ఆస్పత్రికి తరలించారు గానీ, అక్కడ జొనాథన్ మరణించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles