భారతీయులకు భారీ షాక్... హెచ్-1బీ వీసాల పై తాత్కాలిక నిషేధం| US to temporarily suspend premium processing of H1-B visas.

Us to temporarily suspend special payment programme for h 1b visas

H1-B visa, Special Payment Programme, Premium Processing, H1-B visa Temporarily Suspend, Immigration Service, Highly Skilled Workers, H1-B visa Temporarily

The U.S. Citizenship and Immigration Services said Friday that it will temporarily suspend expedited processing for all H-1B petitions starting April 3. H-1B visas allow highly skilled workers to spend three to six years at sponsoring companies in the U.S. They are particularly important to Bay Area technology firms, which use them to fill engineering positions.This suspension, to last up to six months, will apply to applications filed for the fiscal year 2018.

మరో షాక్: హెచ్-1బీ వీసాలపై సస్పెన్షన్

Posted: 03/04/2017 12:35 PM IST
Us to temporarily suspend special payment programme for h 1b visas

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. విదేశీ ఉద్యోగులను నియంత్రించే క్రమంలో తాను చేయాలనుకుంటున్న పనులను సైలెంట్ గా చేసుకుంటూ పోతున్నాడు. హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియకు సంబంధించి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఏప్రిల్ 3 నుంచి ప్రీమియమ్ ప్రోగ్రాం పేరిట తాత్కాలిక నిషేధం విధిస్తూ అమెరికన్ కాంగ్రెస్ కొత్త చట్టం తెచ్చింది.

హెచ్ 1-బీ వీసాల ప్రాసెసింగ్ పై ఆరు నెలల పాటు నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ఆశావహులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటి వరకు ఉన్న వేలాది హెచ్1బీ అప్లికేషన్లను క్లియర్ చేసిన తర్వాతే, కొత్తగా జారీ చేస్తామని అధికారులు తెలిపారు. అయితే, ఇది హెచ్ 1-బీ వీసాలపై సస్పెన్షన్ కాదని చెబుతూనే స్పెషల్ పేమెంట్ ప్రోగ్రాం లో (ఎక్కువ వేతనంతో వెళ్లే నైపుణ్యులైన ఉద్యోగుల కోసం) భాగమని అధికారులు చెబుతున్నారు. మరోపక్క వీసాలపై బ్యాన్ విధించడం ఆరు నెలలకే పరిమితం కాబోదని... ఆ తర్వాత కూడా బ్యాన్ ను పొడిగించే అవకాశాలను కొట్టి పారేయలేమని నిపుణులు చెబుతున్నారు.

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నారైలు, ఆ దేశం వెళ్లాలనుకుంటున్న భారతీయుల పాలిట శరాఘాతంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికా ఉన్నతాధికారులతో భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ సమావేశమయ్యారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మిగ్రేషన్, హెచ్1బీ వీసాలపై వీరు చర్చించారు కూడా. ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, భారత్ తో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : H1-B visa  Temporarily Ban  Special Payment Programme  

Other Articles

Today on Telugu Wishesh