వడ్డీకాసుల వాడికైనా మినహాయింపు లేదా..? devotees donate scraped noted to lord srivaru

Devotees donate scraped noted to lord srivaru

tirumala tirupathi devasthanam, TTD, lord sri venkateshwara swamy, vaddi kasulavadu, scraped notes, lord srivaru, lord balaji, demonetisation, pm modi

tirumala tirupathi venkateshwara swamy got a lot of donations in the form of scraped notes, TTD doesn't understand what to do with those notes.

వడ్డీకాసుల వాడికైనా మినహాయింపు లేదా..?

Posted: 03/03/2017 04:49 PM IST
Devotees donate scraped noted to lord srivaru

ఎవరికైనా సమస్యలు ఉత్పన్నమయితే వారికి చటుక్కున గుర్తుకువచ్చేది కంటికి కనిపించని దేవుడే. కొబ్బరికాయలు కొట్టేసి, నైవేద్యాలు పెట్టేసి దేవుడా ఈ సమస్యను నుంచి మమల్ని గట్టెక్కించు అంటూ కోరుకుంటారు. అయితే ఇక్కడ మనం మనుషులు వారి మనన్తత్వాలు అనే అంశంపై కాకుండా దేవుడి గురించి కూడా ఓ సారి అలోచిద్దామా..? దేవుడికే సమస్యలు ఉత్పన్నమయితే ఏం చేస్తారు..? దానిని ఎవరికి నివేదిస్తారు.. ఎలా పరిష్కరిస్తారు అన్న అలోచన ఎప్పుడైనా కలిగిందా..?

పురాణా కథల్లో దేవుళ్లుకు కష్టాలు వస్తే తీర్చిన ఆ మహావిష్ణువు అవతారంలోని వున్న కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడికే కష్టం వచ్చింది. అదేంటి ఆ దేవదేవుడిని నమ్ముకునే కోట్లాది మంది భక్తులు కలియుగ వైకుంఠానికి వెళ్తుంటారు. అలాంటి అయనకే కష్టం వచ్చిందా..? అంటే అవుననే అనాలి. అది కూడా మన ప్రధానమంత్రి నరేంద్రమోడీ తీసుకువచ్చిన ఇబ్బందే. అలోచనలో పడ్డారా..? అదేంటి నారయణుడికి నరుడి కష్టాలను సృష్టించడమా..? అంటూ విస్తుపోకండి.. ఇది ముమ్మాటికీ నిజం.

కుబేరుడి బాకీ తీర్చుకునేందుక వడ్డీకాసుల వాడికి భక్తులు నిలువుదోపిడీలతో ముడుపులు చెల్లిస్తుంటారు. అయితే ఇలా చెల్లించిన వాటిలో చాలావరకు పాత నోట్లు భారీ మొత్తంలో హుండీల్లో స‌మ‌ర్పించారు కొంద‌రు భ‌క్తులు. ప్రభుత్వం విధించిన డిసెంబ‌ర్ 30 డెడ్‌లైన్ త‌ర్వాత ఈ రెండు నెల‌ల్లో శ్రీవారికి రూ.4 కోట్ల విలువైన పాత 500, వెయ్యి నోట్లు రావ‌డం గ‌మ‌నార్హం. ప్రభుత్వ నిబంధ‌న‌ల ప్రకారం డెడ్‌లైన్ త‌ర్వాత పాత నోట్లు ప‌ది కంటే ఎక్కువ ఉండ‌కూడ‌దు. దీంతో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం అధికారులు ఈ పాత నోట్లను ఏం చేయాలో తెలియ‌క త‌ల ప‌ట్టుకున్నారు. ఈ నోట్లను ఏం చేయాలో చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐకి లేఖ రాశారు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు. కేంద్ర ప్రభుత్వం స్పంద‌న కోసం ఎదురుచూస్తున్నారు టీటీడీ అధికారులు.

డిసెంబ‌ర్ 30 డెడ్‌లైన్ త‌ర్వాత దేశం న‌లుమూల‌ల నుంచి వ‌చ్చే భ‌క్తులు కొత్త నోట్లతోపాటు పాత నోట్లను కూడా హుండీల్లో వేస్తున్నారు. ఇలా రూ.4 కోట్లకుపైగా పాత నోట్లు వ‌చ్చిన‌ట్లు వెల్లడించారు టీటీడీ ఈవో సాంబ‌శివ‌రావు. ఇలా ఎప్పటి నుంచో జ‌మైన పాత నోట్లు కూడా ఇప్పుడు హుండీల్లో చేరిపోయాయి. డిసెంబ‌ర్ 30 డెడ్‌లైన్ త‌ర్వాత పది కంటే ఎక్కువ పాతనోట్లు ఉంటే రెట్టింపు జరిమాన విధించాలని నిర్ణయం తీసుకొంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో తిరుపతి వేంకన్న దగ్గర ఉన్న నాలుగు కోట్ల రూపాయలకు మోడీ ప్రభుత్వం 8 కోట్లు జరిమాన విధిస్తుందా? లేక దేవుడిపై భక్తితో పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు చెల్లిస్తుందా వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles