సీఎం ను లేపేస్తాం అన్నారో లేదో.. బాంబు పేలుడు జరిగింది | RSS Office attacked after make comments on Kerala CM.

4 injured in crude bomb attack on rss office in kerala

RSS Kerala, Kerala RSS, Nadapuram RSS Office, RSS Bomb Attack, CM Pinarayi Vijayan, Pinarayi Vijayan Bounty, Pinarayi Vijayan Laugh, RSS Ujjain Kundan Chandravat, Pinarayi Vijayan RSS, RSS Versus CPI

RSS Ducks As Member Offers Bounty On Kerala Chief Minister's Head. After this comments a crude bomb attack on RSS office in Nadapuram. Pinarayi Vijayan Laughs off RSS Leader's 'Bounty' on his Head.

కేరళ ఆరెస్సెస్ ఆఫీస్ పై బాంబు దాడి

Posted: 03/03/2017 09:53 AM IST
4 injured in crude bomb attack on rss office in kerala

రాష్ట్రంలో అధికార పార్టీ, ఆరెస్సెస్ ల మధ్య మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తలు వరుసగా హత్యకు గురవుతుండడం వెనక ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాత్ర ఉందని, అతని తల తెచ్చిచ్చిన వారికి కోటి రూపాయలు నజరానా ఇస్తానని మధ్యప్రదేశ్‌కు చెందిన ‘షా ప్రచార్ ప్రముఖ్’ కుందన్ చంద్రావత్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఓ ఆరెస్సెస్ కార్యాలయంపై బాంబు దాడి జరగటం పెను కలకలం రేపింది.

నాదపురం సమీపంలోని కలాచీ వద్ద రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) కార్యాలయంపై గురువారం రాత్రి జరిగిన బాంబుదాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాబు, వినీష్‌లను కోజికోడ్ మెడికల్ కాలేజీకి, సుధీర్, సునీల్‌లను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులో వచ్చి కార్యాలయంపై క్రూడ్ బాంబు విసిరినట్టు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

ఇక తన తలపై కోటి రూపాయలు నజరానా ప్రకటనపై పినరయి విజయన్ ఘాటుగా స్పందించారు. ఆర్ఎస్ఎస్ ఇప్పటికే ఎంతో మంది తలలను తీసుకుందని అన్నారు. ఈ బెదిరింపులకు భయపడేది లేదని, తన ప్రయాణాన్ని, తన పనులను తాను చేసుకుపోతానని చెప్పిన విజయన్ నవ్వులు చిందించడం గమనార్హం. కాగా, ఈ వ్యాఖ్యలను సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఖండించారు. సీఎంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని ఆయన మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kerala  RSS  Kundan Chandravat  CM Pinarayi Vijayan  

Other Articles