ఫీఎఫ్ పెన్షన్ దారులకు ఊరట.. ఆధార్ అవసరం లేదట.. Aadhaar not needed for pension withdrawals: EPFO

Aadhaar not mandatory for withdrawals under eps says epfo

Employees Pension Scheme, EPFO, aadhaar number, form 10D, form 10C, mandatory, one time settlement, pension scheme, retirement, PF fund

The Employees’ Provident Fund Organisation said Aadhaar was no longer compulsory for withdrawal claims under the Employees Pension Scheme

ఫీఎఫ్ పెన్షన్ దారులకు ఊరట.. ఆధార్ అవసరం లేదట..

Posted: 03/01/2017 12:56 PM IST
Aadhaar not mandatory for withdrawals under eps says epfo

ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులకు సదరు శాఖ అధికారులు ఊరటనిచ్చారు. ఇక ఆధార్ కార్డు నెంబరు లేకుండానే పెన్షన్ విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు చందాదారుల‌కు క‌ల్పించారు. ఉద్యోగుల భ‌విష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ). సాధార‌ణంగా పదేళ్లు లేదా అంత‌కంటే అధికంగా స‌ర్వీస్ ఉన్నవారు పీఎఫ్ ఫుల్ సెటిల్‌మెంట్ కోసం ద‌ర‌ఖాస్తు చేసేప్పుడు ఫారం పది డితో పాటు ఆధార్‌ను జ‌త‌చేయాల్సి వ‌చ్చేది. అయితే తాజా నిర్ణయం ప్రకారం పీఎఫ్ ఫుల్ అండ్ ఫైన‌ల్ సెటిల్‌మెంట్ కోసం ఆధార్ త‌ప్పనిస‌రి కాదంటూ ఈపీఎఫ్ఓ సీనియ‌ర్ అధికారి వెల్లడించారు.

ఫారం టెన్ డి ద్వారా పెన్షన్ నిర్ధారించుకునే చందాదారు మాత్రం ఆధార్‌ నంబర్‌గానీ ఎన్ రోల్‌మెంట్‌ స్లిప్‌గానీ సమర్పించాల్సి ఉంటుంది. చందాదారులకు ఈ వెసులు బాటు కల్పించడం వెనుక కారణాన్ని వివరిస్తూ ఫారం 10సీలో ఆధార్‌ నెంబర్‌ తప్పనిసరి చేయడం వల్ల సెటిల్‌మెంట్‌ సమయంలో కొన్ని సమస్యలు తలెత్తాయని అందువల్ల దీన్ని కేవలం ఫారం 10డి ద్వారా పెన్షన్  ఫిక్సింగ్‌కి మాత్రమే పరిమితం చేసినట్లు వెల్లడించారు. చందాదారులతో పాటు పెన్షనర్లకు కూడా ఆధార్‌ తప్పనిసరి చేస్తూ జనవరిలో ఈపీఎఫ్‌వో ఆదేశాలు జారీచేసింది.

ఈపీఎఫ్ఓ త‌ర‌పున అమ‌ల‌వుతున్న అన్ని సామాజిక భ‌ద్ర‌తా ప‌థ‌కాల అమ‌లుకు కూడా ఆధార్‌ను త‌ప్ప‌నిస‌రి చేసింది.ఉద్యోగుల పెన్షన్ స్కీం 1995 ప్రకారం ఉద్యోగుల పెన్షన్ సెటిల్‌మెంట్‌కు చేసుకునే దరఖాస్తులో ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ జనవరి చివర్లో ఆదేశాలు జారీ చేసింది. కాగా చందాదారులతో పాటు పెన్షనర్లకు ఆధార్‌ సమర్పించేందుకు ఇచ్చిన గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ ఈపీఎఫ్‌వో ఫిబ్రవరి మొదట్లో నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles