పారిపోతున్న ఓ ఏనుగు పట్టాలు దాటేందుకు ఏం చేసిందో చూస్తే షాకవుతారు | Watch a Young Elephant Make a Surprising Railroad Crossing.

Elephant breaks gate of railway level crossing

Impatient Elephant, Elephant Destroys Railway Gate, Railway Crossing Elephant, Railway Gate Elephant, Chapramari Wildlife Sanctuary, West Bengal Elephant, Elephant Escape

Elephant breaks gate of railway level crossing in West Bengal. The elephant was from Chapramari Wildlife Sanctuary area.

ITEMVIDEOS:రైల్వే గేట్ వద్ద షాకింగ్ వీడియో

Posted: 03/01/2017 08:23 AM IST
Elephant breaks gate of railway level crossing

పశ్చిమ బెంగాల్ లోని జలపైగురి జిల్లా వాసులకు ఓ విచిత్రమైన ఘటన కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకు కారణం ఓ ఏనుగు చేసిన ఫీట్. రైలు వస్తోందని సిబ్బంది రైల్వే గేటు వేశారు. అంతలో ఓ ఏనుగు నెమ్మదిగా అటు నడుచుకుంటూ వచ్చింది. అడవిలో తెగ బోర్ కొడుతుండటంతో అలా షికారుకు వెళ్తామనుకుంది. తనకు అడ్డుగా ఉందని భావించింది ఏమో సదరు గజరాజు గారు ఆ రైల్వే గేటును తన తొండంతో ఎత్తి పట్టాలు దాటి వెళ్లిపోయింది. ఛప్రమరి వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలోని రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

అభయారణ్యం నుంచి తప్పించుకున్న ఒక ఏనుగు బయటికి వెళ్లేందుకు నానా ప్రయత్నం చేసింది. అయితే చుట్టుపక్కల అంతా ఫెన్సింగ్ ఉండటంతో ఎలాగా అనుకుంటూ అక్కడే ఉన్న రైల్వే ట్రాక్ దగ్గరికి చేరింది. ఎలా దాటాలో తెలీక వెంటనే ఆ గేట్ ను అమాంతం ఎత్తేసి దాటేయాలని యత్నించింది. అయితే అవతలి గేట్ వద్ద సేమ్ ఫీట్ రిపీట్ చేద్దామనుకున్నప్పటికీ వీలు కాకపోవటంతో దానిని తొక్కేసి తాపీగా వెళ్లిపోయింది.

 

వీడియో చోద్యంగా చూసిన చుట్టుపక్కల ప్రజలు తేరుకుని ఇప్పుడు భీతిల్లి పోతున్నారు. ఏ క్షణాన తమ ఊరిపై పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే ఏనుగుకి ఏ ప్ర‌మాదం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నామని, ఏనుగులు తరచూ ఇలా రైల్వే పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురవుతుంటాయని, అలా జరిగినప్పుడల్లా తమనే నిందిస్తారని ఓ అధికారి తెలిపాడు. ప్రస్తుతం ఆ మేధావి గజరాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

Today on Telugu Wishesh