తొలిసారి తన ట్విట్ పై వెనక్కు తగ్గిన సెహ్వాగ్.. Tweet not intended for Gurmehar Kaur, claims Virender Sehwag

Virender sehwag says it wasn t intended for gurmehar

virender sehwag, sehwag, virender sehwag twitter, gurmehar kaur, virender sehwag ramjas violence, ramjas violence, ramjas college, virender sehwag randeep hooda, abvp, sports news

Virender Sehwag had posted his photo, holding a placard which read "I did not score two triple centuries, my bat did". The tweet triggered a deluge of reactions.

తన ట్విట్ పై క్లారిటీ ఇచ్చిన వీరేంద్ర సెహ్వాగ్

Posted: 02/28/2017 09:42 PM IST
Virender sehwag says it wasn t intended for gurmehar

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని గుర్‌మెహర్‌ వివాదంలో ఓ ట్విట్టర్‌ ద్వారా కూరుకుపోయిన టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. మౌనాన్ని వీడి తన మాటలను, తన ఉద్దేశాన్ని తప్పుబట్టారని, తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. ‘నా ట్వీట్‌ గుర్మెహర్‌ను ఉద్దేశించి కాదు. అది చిన్న సరదాకు మాత్రమే పెట్టాను. కానీ ప్రజలు దానిని వేరేలా అర్ధంచేసుకున్నారు’ అని ఆయన మంగళవారం ఓ మీడియాతో చెప్పారు.

ఢిల్లీ రాంజాస్ కాలేజిలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీ కార్యకర్తలు చేసిన దాడిని ఖండిస్తూ గుర్‌మెహర్ సోషల్ మీడియాలో చేసిన పోస్టింగ్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. లేడీ శ్రీరామ్ కాలేజి విద్యార్థిని అయిన గుర్‌మెహర్.. తాను ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థినినని, తాను ఏబీవీపీకి భయపడనని ఫేస్‌బుక్‌లో కామెంట్ చేశారు. అంతకుముందు తన తండ్రిని పాకిస్థాన్ చంపలేదని, యుద్ధ చంపిందని రాసిన ఫ్లకార్డ్ చేతబట్టుకుని ఉన్న ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశాక వార్తల్లోకి నిలిచారు.

అయితే అదే సమయంలో గుర్‌మోహర్ వ్యాఖ్యలకు సమాధానం అనిపించే భావన వచ్చేట్టుగా సెహ్వాగ్ చేసిన ట్వీట్ చర్చనీయాంశం అయింది. ఆ ట్వీట్‌తో కొంతమంది ఏకీభవించగా ఇంకొందరు విభేదించారు.'నేను రెండు ట్రిపుల్ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్ చేసింది' అంటూ వీరూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై గుర్‌మెహర్‌ కూడా స్పందిస్తూ తనను సెహ్వాగ్‌ ట్వీట్‌ బాగా హర్ట్‌ చేసిందని చెప్పింది. ఈ నేపథ్యంలో వీరేంద్ర సెహ్వాగ్‌ చేసిన తాజా ప్రకటన ప్రాధాన్యం సతంరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virender sehwag  twitter  gurmehar kaur  ramjas violence  randeep hooda  abvp  

Other Articles