పెళ్లైన రోజునే వరుడికి వధువు షాక్..! నగలతో పరార్.! Bride decamps with jewellery on wedding night

Bride decamps with jewellery on wedding night

Inspector Mukesh Kumar,wedding night,Najirabad police station,nearly Rs,26-year-old woman,Sarojini Nagar,husbands house,Bride decamps,brides room

A newly-wed woman in Sarojini Nagar here allegedly made off with nearly Rs 2.5 lakh worth of jewellery from her husband's house on the first night of weeding, police said

పెళ్లైన రోజునే వరుడికి వధువు షాక్..! నగలతో జంప్..!

Posted: 02/25/2017 07:35 PM IST
Bride decamps with jewellery on wedding night

ఉత్తరప్ర‌దేశ్ లోని కాన్పూర్‌ జిల్లాలో ఎన్నో కలలు కంటూ తన జీవితంలోకి ఒక స్త్రీని తన సతిగా అహ్వానించిన వరుడికి గట్టిషాక్ తగిలింది. ఏడేడు జన్మల బంధం అంటూ అత్యంత పవిత్ర బంధంగా విశ్వసిస్తూ భారత సంప్రదాయంగా కొనసాగుతున్న వివాహ బంధాన్ని కేవలం బంగారుఅభరణాల బంధంగా మర్చివేసిన ఘటన అది. మగవాళ్లు అక్కడక్కడా వివాహబంధాన్ని అవహేళన చేసే చర్యలకు పాల్పడినా.. వధువులు మాత్రం పెళ్లి కాగానే తమ జీవితం అంతా భర్తతోనే అని ఫిక్స్ అయిపోతారు. అయితే ఇక్కడ మాత్రం ఓ వదువు వరుడికి పెళ్లి జరిగి 24 గంటలు కూడా కాకముందే పట్టపగలు చుక్కలు చూపించింది. అదెలా అంటారా..?

నజిరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సరోజనీనగర్‌కు చెందిన శ్యాంబాబు అనే యువకుడు గురువారం దేవరియా గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఇక‌ త‌న వైవాహిక జీవితాన్ని ఆనందంగా గ‌డుపుదామ‌ని అనుకున్నాడు. అయితే, ఎన్నో కలలుగన్న శ్యాంబాబు జీవితం మళ్లీ యూ టర్న్ తీసుకుంది. ఆ యువ‌తికి శ్యాంబాబు మూడు ముళ్లు వేసిన అదే రోజు బంగారు నగలన్నింటినీ తీసుకుని పారిపోయింది ఆ వధువు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. వధూ వరులకు చెందిన రూ.2.50 లక్షలు మాయ‌మ‌య్యాయ‌ని, వ‌ధువు సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తోందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kanpur  sarojininagar  shyam babu  Devariya  bride decamps with gold jewellery  bride  bridegroom  crime  

Other Articles